Rohit Sharma : రోహిత్ శర్మ అయినా మినహాయింపు లేదు..షాక్ ఇచ్చిన బీసీసీఐ.. దేశవాలీలో ఆడాల్సిందే

టీమిండియా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ బీసీసీఐ చాలా క్లియర్ మెసేజ్ పంపింది. వారి ఫామ్ అద్భుతంగా ఉన్నా, ఫిట్‌నెస్‌ మెరుగుపడినా.. జాతీయ జట్టుకు ఆడనప్పుడు తప్పకుండా దేశవాళీ క్రికెట్‌లో తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించాల్సిందేనని బోర్డు కరాఖండీగా చెప్పింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో వచ్చిన ఈ కఠిన నిర్ణయం.. అత్యుత్తమ ఆటగాళ్లకు కూడా వర్తించనుంది

Rohit Sharma : రోహిత్ శర్మ అయినా మినహాయింపు లేదు..షాక్ ఇచ్చిన బీసీసీఐ.. దేశవాలీలో ఆడాల్సిందే
Rohit Sharma

Updated on: Dec 03, 2025 | 4:00 PM

Rohit Sharma : టీమిండియా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ బీసీసీఐ చాలా క్లియర్ మెసేజ్ పంపింది. వారి ఫామ్ అద్భుతంగా ఉన్నా, ఫిట్‌నెస్‌ మెరుగుపడినా.. జాతీయ జట్టుకు ఆడనప్పుడు తప్పకుండా దేశవాళీ క్రికెట్‌లో తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించాల్సిందేనని బోర్డు కరాఖండీగా చెప్పింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో వచ్చిన ఈ కఠిన నిర్ణయం.. అత్యుత్తమ ఆటగాళ్లకు కూడా వర్తించనుంది.

టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్.. రోహిత్ శర్మకు ఒక విషయం స్పష్టం చేశారు. అదేంటంటే, 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం నిలబెట్టుకోవాలంటే, విజయ్ హజారే ట్రోఫీలో కచ్చితంగా ఆడాల్సిందేనని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు రోహిత్ శర్మ రాబోయే విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తన లభ్యతను ధృవీకరించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. గతంలో బార్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు, ఇదే పాలసీలో భాగంగా రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ రంజీ ట్రోఫీలో కూడా ఆడాల్సి వచ్చింది.

ఈ దేశవాళీ క్రికెట్ పాలసీకి విరాట్ కోహ్లీ కూడా లొంగక తప్పలేదు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. కోహ్లీ గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్‌ల్లో ఆడనున్నాడు. ఢిల్లీ జట్టు డిసెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తమ మొదటి మ్యాచ్‌ను ఆంధ్రతో అలూర్‌లో ఆడనుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం ఇదే మొదటిసారి కానుంది.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (రోహిత్), RCB (కోహ్లీ) కెప్టెన్‌లుగా తరచూ తలపడే ఈ ఇద్దరు దిగ్గజాలు, దాదాపు 15 ఏళ్లలో దేశవాళీ క్రికెట్‌లో ఒకరిపై ఒకరు ఆడలేదు. ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ (ముంబై), కోహ్లీ (ఢిల్లీ) గ్రూపులు వేరుగా ఉన్నప్పటికీ, వారి జట్లు కనుక నాకౌట్ రౌండ్స్‌కు చేరుకుంటే, ఈ ఇద్దరు భారత వెటరన్స్ ఒకరిపై ఒకరు తలపడే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ దేశవాళీ టోర్నమెంట్‌లోకి రోహిత్ శర్మ మరింత బలమైన ఆటగాడిగా తిరిగి వస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు దాదాపు 11 కిలోల బరువు తగ్గి, ఫిట్‌నెస్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్న రోహిత్ మరింత చురుకుగా కనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆడిన 4 మ్యాచ్‌ల్లో 86.33 సగటుతో ఏకంగా 259 పరుగులు చేసి, భారత్‌కు అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదే ఫామ్‌ను కొనసాగించాలని రోహిత్ చూస్తున్నాడు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..