Robin Uthappa Retirement: రాబిన్ ఊతప్ప.. బౌలర్ ఎవరైనా క్రీజు మధ్యలో కొచ్చి ఈజీగా సిక్సర్లు కొట్టే ఈ హార్డ్ హిట్టర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2007 దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెల్చుకోవడంలో ఈ స్టార్ బ్యాటర్ కీలక పాత్ర పోషించాడు. తన హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఊతప్ప క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దేశం, కర్ణాటక తరఫున ప్రాతినిథ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు, రెండు దశాబ్దాల తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రిటైర్మెంట్ ప్రకటనలో తెలిపాడు ఊతప్ప. 2007 వరల్డ్‌కప్‌లో సరిగ్గా ఇదే రోజు పాకిస్తాన్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఊతప్ప. 39 బంతుల్లో 50 రన్స్ చేసి టీమిండియా విజయంలో కీ రోల్ పోషించాడు. సరిగ్గా ఇదే రోజు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇక కెరీర్ విషయానికొస్తే.. 2006లో ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఉతప్ప 96 బంతుల్లో 86 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పట్లో వన్డేల్లో భారత్‌కు అరంగేట్రం మ్యాచ్‌లో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్‌గా రికార్డు సృష్టించింది. ఉతప్ప మెరుపు ఇన్నింగ్స్‌తో ఆ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇక ఓవరాల్ కెరీర్‌లో భారత్ తరఫున 46 వన్డేలు ఆడిన ఊతప్ప 934 పరుగులు చేశాడు. అలాగే13 టీ20 మ్యాచ్‌ల్లో 249 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లోనూ ఈ కర్ణాటక ఆటగాడికి ఘనమైన రికార్డులు ఉన్నాయి. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలుచుకున్నప్పుడు, ఉతప్ప ఆ సీజన్‌లో అత్యధిక పరుగుల (660)కు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగోసారి చాంపియన్‌గా నిలబెట్టడంలో ఉతప్పది కీ రోల్. తొలి క్వాలిఫయర్‌లో 63 పరుగులు చేసిన ఉతప్ప ఆ తర్వాత ఫైనల్‌లో కేవలం 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన అతను 4, 952 పరుగులు చేశాడు.
It has been my greatest honour to represent my country and my state, Karnataka. However, all good things must come to an end, and with a grateful heart, I have decided to retire from all forms of Indian cricket.
Thank you all ❤️ pic.twitter.com/GvWrIx2NRs
— Robin Aiyuda Uthappa (@robbieuthappa) September 14, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..