Viral Video : ఏంటిది బాసూ!..పంత్‌ను చూసి నవ్వుకున్న కెమెరామెన్..షూటింగ్‌లో కామెడీ ఆఫ్ ది డే

భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. ఈ కీలకమైన పోరుకు ముందు టీమిండియా ఆటగాళ్లు ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన సరదా వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా ఇతర ఆటగాళ్లు సందడి చేశారు.

Viral Video : ఏంటిది బాసూ!..పంత్‌ను చూసి నవ్వుకున్న కెమెరామెన్..షూటింగ్‌లో కామెడీ ఆఫ్ ది డే
Rishabh Pant (1)

Updated on: Nov 29, 2025 | 1:00 PM

Viral Video : భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. ఈ కీలకమైన పోరుకు ముందు టీమిండియా ఆటగాళ్లు ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన సరదా వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా ఇతర ఆటగాళ్లు సందడి చేశారు. అయితే ఈ షూట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి రిషబ్ పంత్.

టీమిండియాలోని ఇతర ఆటగాళ్ల మాదిరిగానే రిషబ్ పంత్ కూడా ఫోటోషూట్‌కు వచ్చాడు. పంత్ ఫోటోలు తీస్తుండగా అతని మొహంలో సరిగా చిరునవ్వు లేకపోవడం గమనించిన ఫొటోగ్రాఫర్.. కొంచెం బాగా నవ్వండి అని అడిగాడు. అందుకు పంత్, నేను నిద్రపోతున్నాను. ఇప్పుడే నిద్రలేచి వచ్చానంటూ నవ్వు తెప్పించే ఆన్సర్ ఇచ్చాడు. పంత్ కళ్లలో నిజంగానే నిద్ర మత్తు కనిపిస్తుండటం ఈ వీడియోలో హైలైట్ అయింది. మరోవైపు, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఉత్సాహంగా కనిపించగా, విరాట్ కోహ్లీ తనదైన ప్రొఫెషనల్ స్టైల్‌లో ఫోటోలకు పోజులిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఫొటోగ్రాఫర్‌కే ఏ యాంగిల్‌లో ఫోటోలు తీయాలో సూచించడం కనిపించింది.

ఈ సరదా సన్నివేశాలు ఒకవైపు ఉన్నప్పటికీ, టీమిండియాకు ఈ వన్డే సిరీస్ గెలవడం చాలా కీలకం. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-2 తేడాతో క్లీన్ స్వీప్ అయిన తర్వాత, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌లోనైనా టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాలని గంభీర్ ఆశిస్తున్నారు. గత వన్డే సిరీస్‌ను కూడా భారత్ ఆస్ట్రేలియా చేతిలో కోల్పోయింది. ఒకవేళ ఈ సిరీస్‌లో కూడా ఓడిపోతే, జట్టుపై, కోచ్‌పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..