ఇంగ్లాండ్‌తో వన్డేలకు రిషబ్ పంత్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్.. త్వరలోనే అధికారిక ప్రకటన.!

|

Feb 16, 2021 | 5:03 PM

Rishabh Pant And Suryakumar Yadav: టెస్టుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఇంగ్లాండ్‌తో జరగబోయే...

ఇంగ్లాండ్‌తో వన్డేలకు రిషబ్ పంత్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్.. త్వరలోనే అధికారిక ప్రకటన.!
Follow us on

Rishabh Pant And Suryakumar Yadav: టెస్టుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు పంత్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టిన సంగతి విదితమే. కేవలం టెస్టుల్లో చోటు దక్కించుకున్న పంత్.. తన ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడంలో రిషబ్ పంత్ పాత్ర ఉందన్న విషయం తెలిసిందే. అందుకే పంత్‌కు వన్డేల్లో మరో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఈసారి రిషబ్ పంత్‌ను వన్డేలకు ఎంపిక చేయనున్నారట.

ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కన్సిస్టెంట్ పెర్ఫర్మార్‌గా పేరు సంపాదించుకున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను టీ20ల కోసం పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. మనీష్ పాండే లేదా శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అతడిని తీసుకుని అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని ఎన్‌సీఏ(NCA)లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. కాగా, ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ మార్చి 12 నుంచి 20 వరకు జరగనుండగా.. మూడు వన్డేలు మార్చి 23, 26, 28 తేదీలలో జరుగుతాయి.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!