Rishabh Pant Injured: రిషబ్ పంత్‌కు మళ్లీ గాయం.. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో కంబ్యాక్ కష్టమేనా?

భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఫ్యాన్స్‌కి, టీమిండియాకు షాకింగ్ న్యూస్. గతంలో తీవ్ర గాయం నుంచి కోలుకొని సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న పంత్, ఇప్పుడు మరోసారి గాయాల బారిన పడ్డాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లోని రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా, అతడికి కేవలం మూడు బంతుల్లో మూడుసార్లు బంతి తగిలింది.

Rishabh Pant Injured: రిషబ్ పంత్‌కు మళ్లీ గాయం.. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో కంబ్యాక్ కష్టమేనా?
Rishabh Pant

Updated on: Nov 08, 2025 | 2:02 PM

Rishabh Pant Injured: భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఫ్యాన్స్‌కి, టీమిండియాకు షాకింగ్ న్యూస్. గతంలో తీవ్ర గాయం నుంచి కోలుకొని సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న పంత్, ఇప్పుడు మరోసారి గాయాల బారిన పడ్డాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లోని రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా, అతడికి కేవలం మూడు బంతుల్లో మూడుసార్లు బంతి తగిలింది. తీవ్రమైన నొప్పి కారణంగా పంత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది. ఈ గాయం కారణంగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లో పంత్ ఆడటంపై సందేహాలు మరింత పెరిగాయి.

బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భారత్ ఏ, సౌతాఫ్రికా ఏ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. మ్యాచ్ మూడవ రోజున, బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ దురదృష్టవశాత్తూ మూడు బంతుల్లో మూడుసార్లు గాయపడ్డాడు. సౌతాఫ్రికా ఏ పేస్ బౌలర్ త్శేపో మోరెక్ వేసిన వరుస బంతుల్లో పంత్‌కు దెబ్బలు తగిలాయి. మొదట ఒక బంతి హెల్మెట్‌కు తగలగా, దాని తర్వాత బంతి ఎడమ చేతి మోచేతికి తగిలింది. ఆ తర్వాత బంతి పొట్టకు తగలడంతో పంత్ తీవ్ర నొప్పిని తట్టుకోలేకపోయాడు.

మోరెక్ బౌలింగ్‌లో మూడుసార్లు గాయపడిన పంత్, కోచ్ హృషికేష్ కనిత్కర్, ఫిజియో సలహా మేరకు రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతను 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 17 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా పంత్ 20 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కాలి బొటనవేలికి ఫ్రాక్చర్ అయిన పంత్, ఆ గాయం నుంచి కోలుకొని దాదాపు మూడున్నర నెలల తర్వాత టెస్ట్ సిరీస్‌తో తిరిగి జట్టులోకి రావడానికి సిద్ధమవుతున్నాడు.

కొత్తగా తగిలిన ఈ గాయాల తీవ్రత తెలియాల్సి ఉంది. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లో పంత్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ గాయాల కారణంగా అతను తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. సిరీస్ ప్రారంభానికి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి, పంత్ పూర్తి విశ్రాంతి తీసుకుని ఫిట్‌నెస్ సాధిస్తేనే టీమిండియాలో చేరే అవకాశం ఉంటుంది. ప్లేయింగ్ ఎలెవన్‌ను మాత్రం మ్యాచ్ రోజునే ప్రకటిస్తారు.

ఈ అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో పేలవమైన ప్రదర్శన చేసింది. ఇండియా-ఏ మొదటి ఇన్నింగ్స్ 255 పరుగులకు ఆలౌట్ కాగా, సౌత్ ఆఫ్రికా ఏ 221 పరుగులు చేసింది. ఇండియా-ఏ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్ (27), సాయి సుదర్శన్ (23), దేవదత్ పడిక్కల్ (24) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫుల్ స్కోర్ బోర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..