The Hundred : ద హండ్రెడ్ లీగ్‌లో RCB స్టార్ల అరాచకం..13 బంతుల్లో 50 పరుగులు.. 136 ఏళ్ల రికార్డు బ్రేక్
2025 సంవత్సరం ఆర్సీబీది, ఆ జట్టు ఆటగాళ్లది అనిపిస్తోంది. ఎందుకంటే, ద హండ్రెడ్ లీగ్‌లో కూడా వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే మ్యాచ్‌లో హీరోలుగా నిలిచిన ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆడతారు. ఈ ఇద్దరూ కలిసి కేవలం 13 బంతుల్లో 50 పరుగులు సాధించి సంచలనం సృష్టించారు.

The Hundred : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌కు మరోసారి పండగ వాతావరణం నెలకొంది. ఐపీఎల్ 2025లో తొలిసారిగా కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టు, ఇప్పుడు ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో కూడా మెరిపిస్తోంది. ఈ లీగ్‌లో ఆర్సీబీకి ఆడిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. లీయమ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్ కలిసి కేవలం 13 బంతుల్లో 50 పరుగులు సాధించి సంచలనం సృష్టించారు.
136 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బెథెల్
జాకబ్ బెథెల్ అంటే ఆర్సీబీ ఫ్యాన్స్‌కి బాగా తెలుసు. 136 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి ఇంగ్లాండ్‌కు అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా ఎంపికైన జాకబ్ బెథెల్‌ను ఆర్సీబీ రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసిన లీయమ్ లివింగ్‌స్టోన్‌తో కలిసి ఈ మ్యాచ్‌లో ధూంధూం బ్యాటింగ్‌తో అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి 35 బంతులు మిగిలి ఉండగానే తమ జట్టును గెలిపించారు.
13 బంతుల్లో 50 పరుగులు
ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా లండన్ స్పిరిట్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ జట్టు 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్ జో క్లార్క్ అర్ధశతకం సాధించగా, ఆ తర్వాత వచ్చిన లీయమ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్ క్రీజులోకి రాగానే బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరూ కలిసి 25 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, అందులో 50 పరుగులు కేవలం 13 బంతుల్లోనే రావడం విశేషం. ఈ 13 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి.
ఒక్కొక్కరి స్ట్రైక్ రేట్ 225+
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున ఆడిన లీయమ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్ ఇద్దరూ దాదాపు 225 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించారు. లివింగ్‌స్టోన్ 20 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. జాకబ్ బెథెల్ 8 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీరిద్దరి సహకారంతో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లీయమ్ లివింగ్‌స్టోన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




