ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత మహిళా ప్లేయర్స్ జాక్‌పాట్ కొట్టారు. సీనియర్స్ దగ్గర నుంచి జూనియర్స్ వరకు అందరూ మిలీనియర్లుగా మారారు. ఇక భారత వుమెన్స్ టీం స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు ఈ వేలంలో కాసుల వర్షం కురిసింది. రూ. 50 లక్షలతో బేస్ ప్రైస్‌తో వేలంలోకి అడుగుపెట్టిన స్మృతిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.4 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ముంబై, బెంగళూరు మధ్య స్మృతి మంధాన కోసం తీవ్రమైన పోటీ జరగగా.. చివరికి ఆర్‌సీబీ.. ఈ స్టార్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది.
మెన్స్ టీమ్ జెర్సీ ’18’.. వుమెన్స్ టీమ్ జెర్సీ ’18’ రెండింటిని రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకోవడంతో.. బెంగళూరు ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిసా పెర్రీని కూడా ఆర్‌సీబీ సొంతం చేసుకోవడంతో.. స్మృతి, పెర్రీ మధ్య కెప్టెన్సీ ఎవరికి ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కొంతమందైతే.. మెన్స్ ఆర్‌సీబీకి.. విరాట్ కోహ్లీ, వుమెన్స్ ఆర్‌సీబీకి ‘లేడీ విరాట్ కోహ్లీ’ కెప్టెన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈసారైనా బెంగళూరుకు స్మృతి మంధాన కప్ అందిస్తుందో.. లేదో వేచి చూడాలి.
Then, now, forever!
#18 is a Royal Challenger and we are screaming! You? ?#PlayBold #WeAreChallengers #WPL2023 #WPLAuction
— Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2023