IPL 2025: ఛీ.. ఛీ.. ఇదెక్కడి చెత్త రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా ఆర్‌సీబీ

ఆర్‌సీబీ కేవలం 42 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆర్‌సీబీ పూర్తి 14 ఓవర్లు కూడా ఆడలేదేమో అనిపించింది. అయితే, టిమ్ డేవిడ్ ఒక ఎండ్‌ను పట్టుకుని చివరి ఓవర్‌లో దాడి చేసి తన జట్టును 100 పరుగుల మార్కుకు దగ్గరగా తీసుకెళ్లాడు. ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ కూడా 53 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. యువ ఆటగాడు నేహాల్ వధేరా కేవలం 19 బంతుల్లో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచి విజంయ అందించాడు.

IPL 2025: ఛీ.. ఛీ.. ఇదెక్కడి చెత్త రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా ఆర్‌సీబీ
Rcb Reocrds

Updated on: Apr 19, 2025 | 10:37 AM

Most IPL Losses at Home: ఐపీఎల్ 2025లో శుక్రవారం రాత్రి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వర్షం కారణంగా, మ్యాచ్ 14 ఓవర్లు నిర్ణయించగా, బెంగళూరు బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. దీంతో ఆర్‌సీబీ 95 పరుగులు మాత్రమే చేయగలిగారు. అనంతరం ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట చాలా చెత్త రికార్డు నమోదైంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ వరుసగా మూడో మ్యాచ్‌లో సొంతగడ్డపై ఓడిపోయింది. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో సొంతగడ్డపై అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిపోయిన జట్టుగా నిలిచింది.

ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్‌సీబీ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో తన సొంత మ్యాచ్‌లను ఆడుతోంది. ఈ వేదికపై శుక్రవారం రాత్రి జరిగిన ఓటమితో ఆర్‌సీబీ పేరిట ఓ చెత్త రికార్డ్ నమోదైంది. మొత్తం మీద 46వ సారి సొంతమైదానంలో ఓడిపోయింది. అంతకుముందు, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇప్పటివరకు 45 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట హోమ్ గ్రౌండ్‌లో అత్యధిక ఓటములు నమోదయ్యాయి. బెంగళూరు ఇప్పుడు ఢిల్లీని అధిగమించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ వారి సొంత మైదానం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 38 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ వాంఖడేలో 34 మ్యాచ్‌ల్లో, పంజాబ్ కింగ్స్ మొహాలీలో 30 మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి.

ఇది కూడా చదవండి: కాటేరమ్మ కొడుకులమంటూ ఫోజులు.. కట్‌చేస్తే.. 7 మ్యాచ్‌లకే సీన్ రివర్స్.. 300లంటూ కావ్యకే కన్నీళ్లు తెప్పించారుగా

నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆర్‌సీబీ కేవలం 42 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆర్‌సీబీ పూర్తి 14 ఓవర్లు కూడా ఆడలేదేమో అనిపించింది. అయితే, టిమ్ డేవిడ్ ఒక ఎండ్‌లో నిలిచి చివరి ఓవర్‌లో దాడి చేసి తన జట్టును 100 పరుగుల మార్కుకు దగ్గరగా తీసుకెళ్లాడు. ఐపీఎల్ చరిత్రలో తన తొలి అర్ధ సెంచరీ సాధించిన డేవిడ్.. 26 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. స్కోరును ఛేదించే క్రమంలో, పంజాబ్ కింగ్స్ 53 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ సమయంలో 36 బంతుల్లో 43 పరుగులు మాత్రమే అవసరం. యువ ఆటగాడు నేహాల్ వధేరా కేవలం 19 బంతుల్లో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచి తన జట్టును విజయం సాధించడంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకున్నాడు.

ఇది కూడా చదవండి: నాడు బ్రహ్మ రాతను మార్చాడు.. నేడు విధి రాతకు బలయ్యాడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లోనే మోస్ట్ ఫ్లాప్ ప్లేయర్‌గా

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..