RCB vs CSK, IPL 2021: చెన్నై టీం టార్గెట్ 157.. అర్థ శతకాలతో రాణించిన విరాట్ కోహ్లీ, పడిక్కల్

|

Sep 24, 2021 | 9:38 PM

RCB vs CSK: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దీంతో సీఎస్‌కే టీం ముందు 157 టార్గెట్‌ను ఉంచింది.

RCB vs CSK, IPL 2021: చెన్నై టీం టార్గెట్ 157.. అర్థ శతకాలతో రాణించిన విరాట్ కోహ్లీ, పడిక్కల్
Ipl 2021, Rcb Vs Csk Virat Kohli And Padikkal
Follow us on

IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా నేడు షార్జాలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ టీంల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో విరాట్ సేన బ్యాటింగ్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దీంతో సీఎస్‌కే టీం ముందు 157 టార్గెట్‌ను ఉంచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(53 పరుగులు, 41 బంతులు, 6 ఫోర్లు, సిక్స్), దేవదత్ పడిక్కల్ (70 పరుగులు, 50 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. షార్జాలో మైదానం చిన్నగా ఉండడంతో బౌండరీల మోత మోగించారు. ఇద్దరూ కలిసి ఓ దశలో అర్థ సెంచరీ కోసం బౌండరీలలో పోటీ పడ్డారు. అలాగే 140 పైగా స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు.

ఆర్‌సీబీ టీం 13.2ఓవర్లో కోహ్లీ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. డ్వేన్ బ్రావో వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా తరలించిన కోహ్లీ.. జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు. దీంతో టీం స్కోర్ 111 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. దీంతో సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏబీ డివిలియర్స్‌(12) శార్దుల్ బౌలింగ్‌లో 16.5 ఓవర్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆవెంటనే మరో బంతికి ఓపెనర్ పడిక్కల్ కూడా రాయుడికి క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టిం డేవిడ్(1) కూడా త్వరగానే ఔటయ్యాడు.

అనంతరం డ్వేన్ బ్రావో వేసిన 20 ఓవర్లో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 154 పరుగుల వద్ధ మాక్స్‌వెల్, 156 పరుగుల వద్ద హర్షల్ పటేల్ వికెట్లను కోల్పోయింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు, డ్వేన్ బ్రావో 3, చాహర్ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: PM Modi: మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.. ఎందుకో తెలుసా?

IPL 2021: నటరాజన్ స్థానంలో జమ్మూ కశ్మీర్ బౌలర్.. హైదరాబాద్‌ జట్టులో ఎన్ని రోజులుంటాడంటే?

RCB vs CSK Live Score, IPL 2021: ఆర్‌సీబీ స్కోర్ 156/6.. అర్థ సెంచరీలతో రాణించిన కోహ్లీ, పడిక్కల్.. సీఎస్‌కే టార్గెట్ 157