కావాలనే మ్యాక్స్‌వెల్‌ కోసం పోటీ పడ్డాం..! అందుకే భారీ ధర చెల్లించాం.. అసలు నిజాన్ని వెల్లడించిన విరాట్‌కోహ్లీ..

|

Apr 10, 2021 | 5:29 AM

VIRAT KOHLI COMENTS : తాము కావాలనే మ్యాక్స్‌వెల్‌ను అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకున్నామని ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. కన్నడ కమెడియన్‌ దానిష్‌ సైట్‌తో

కావాలనే మ్యాక్స్‌వెల్‌ కోసం పోటీ పడ్డాం..! అందుకే భారీ ధర చెల్లించాం.. అసలు నిజాన్ని వెల్లడించిన విరాట్‌కోహ్లీ..
Virat Kohli Coments
Follow us on

VIRAT KOHLI COMENTS : తాము కావాలనే మ్యాక్స్‌వెల్‌ను అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకున్నామని ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. కన్నడ కమెడియన్‌ దానిష్‌ సైట్‌తో ముచ్చటించిన కోహ్లి .. మ్యాక్స్‌వెల్‌ కోసం ఎందుకు పోటీ పడ్డామో వివరించాడు. ఈ మేరకు ఒక వీడియోను ఆర్సీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో విరాట్‌ ఏం చెప్పాడంటే.. జట్టు పథకం ప్రకారమే ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకున్నట్లు తెలిపాడు.

గత ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్‌ విఫలమైనప్పటికి ఆస్ట్రేలియా పర్యటనలో తన సత్తా చాటడాన్ని గమనించామని చెప్పాడు. ఐపీఎల్‌ కోసం తనను తాను మరోసారి రుజువు చేసుకోవడానికి కష్టపడటాన్ని తాము చూశామన్నాడు. అంతేకాకుండా జట్టుకు ఒక ఆల్‌రౌండర్ అవసరం చాలా ఉందని, ఇవన్ని పరిశీలించి అతడిని ఎలాగైనా జట్టులోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపాడు. అందుకోసం ఎంతైనా చెల్లించాలని అనుకున్నామని అందుకే వేలంలో భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్నామని వివరించాడు.

మా జట్టులో పెద్దగా ఒత్తిడి ఉండదని, ఎందుకంటే చాలామంది మ్యాచ్‌ విన్నర్లు మా జట్టులో ఉన్నారని గుర్తుచేశాడు. ఎవరి పని వారు చేసుకుపోతే ఏ ఒక్క ఆటగాడి మీద ఒత్తిడి అనేది ఉండదని, కచ్చితంగా ఆర్సీబీకి మ్యాక్స్‌వెల్ ఉపయోగపడుతాడన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాక్స్‌వెల్‌ని ఉద్ధేశించి తనపై ఎక్కువ ఆశలు పెట్టుకోలేదని కానీ మ్యాచ్‌ విన్నర్‌గా మాత్రం చూడాలనుకుంటున్నామని మనసులో మాట వెల్లడించాడు. మ్యాక్స్‌వెల్ చాలా టాలెంట్‌ ఉన్న ఆటగాడని, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు చాలా బాగా ఆకట్టుకున్నాడని విరాట్‌ చెప్పుకొచ్చాడు.

తొలిపోరులో బోణీ కొట్టిన కోహ్లీసేన.. చివరి బంతి వరకు ఉత్కంఠ.. ముంబై ఇండియన్స్‌పై బెంగుళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ గెలుపు..

IPL 2021: ఐపీఎల్ 2021 చూసేముందు ఈ వార్తను చదవండి.. సిక్సులు, ఫోర్లు, సెంచరీలు ఇవన్నీ మీకోసం.. ఇప్పుడు సరదా మరోలా ఉంటుంది..

MI vs RCB Playing XI IPL 2021: ఆర్సీబీ‌తో ముంబై ఢీ.. కోహ్లిసేనకు అదే మైనస్ కానుందా.!