
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. కానీ జట్టులోని కొందరు కీలక ఆటగాళ్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. భారీ ధరలకు కొనుగోలు చేసిన ఈ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోతే జట్టుకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టులో స్టార్ ఆటగాళ్ల కొరత లేదు. అయితే ఐపీఎల్ వంటి కఠినమైన టోర్నీలో ఫామ్ చాలా కీలకం. ఒక చిన్న తప్పు కూడా ప్లేయింగ్ XIలో స్థానం కోల్పోయేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో, ఇటీవల ఫామ్ బలహీనంగా ఉన్న ముగ్గురు ఆటగాళ్లపై ఆర్సీబీ భారీ నమ్మకం పెట్టుకుంది. కానీ, వాళ్లు ఈ సీజన్‌లో ప్రభావం చూపగలరా అన్నది ప్రశ్నగా మారింది.
ఇంగ్లాండ్‌కు చెందిన ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను ఆర్సీబీ రూ.11.5 కోట్లకు రిటైన్ చేసింది. అయితే, ఇటీవల అతని ప్రదర్శన ఆశించినంతగా లేదు. టీ ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026)లో 8 మ్యాచ్‌లలో కేవలం 130 పరుగులు మాత్రమే చేశాడు. ఐదు ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లతో ఔట్ కావడం అతని ఫామ్‌పై సందేహాలు పెంచింది.
ఐఎల్ టీ20 (ILT20), శ్రీలంక సిరీస్‌లో కూడా అతను పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో ఐపీఎల్ 2026లో అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
మాజీ కేకేఆర్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer)ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్ 2025లో అతను 11 మ్యాచ్‌లలో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా తక్కువగానే ఉంది. దేశీయ టోర్నీల్లో కూడా అతని ప్రదర్శన నిరాశ కలిగించింది. సయ్యద్ మస్తక్ ఆలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy), విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో కూడా అతను స్థిరమైన ఫామ్ చూపలేకపోయాడు.
ఈ పరిస్థితుల్లో ప్లేయింగ్ XIలో స్థానం పొందడం కూడా అతనికి సవాల్‌గా మారింది.
శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారా (Nuwan Thushara)ను ఆర్సీబీ రూ. 1.6 కోట్లకు తీసుకుంది. ఇటీవల అతని బౌలింగ్ ఫామ్ ఆశాజనకంగా లేదు. ఐఎల్ టీ20 (ILT20)లో కూడా ఎక్కువ వికెట్లు తీసుకోలేకపోయాడు.
ఆర్సీబీలో ఇప్పటికే భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar), రషీద్ సలాం (Rasikh Salam), జాకబ్ డఫ్పీ (Jacob Duffy) వంటి బౌలర్లు ఉండటంతో అతనికి అవకాశాలు తక్కువగా ఉండొచ్చు. అవకాశం వచ్చినా, అతను ప్రభావం చూపగలడా అనేది అనుమానమే.
ఆర్సీబీ జట్టు పేపర్‌పై బలంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ ముగ్గురు ఆటగాళ్ల ఫామ్ జట్టుకు కీలకం అవుతుంది. వాళ్లు రాణిస్తే ఆర్సీబీ మరోసారి టైటిల్ కోసం పోటీలో ఉంటుంది. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..