
మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో ఆర్సీబీ గెలవడంతో కర్ణాటకలోని బెంగళూరు నగరం ఒక విధంగా స్తంభించిపోయింది. అయితే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగడంతో క్రికెట్ అభిమానులు ఊపిరి బిగబట్టి మ్యాచ్ చూశారు. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులైతే ఒంటికాలుపై నిల్చోని ఈ మ్యాచ్ చూశారు. మ్యాచ్ చివరి క్షణాల్లో.. 18 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక విజయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గరగా రావడంతో ఊపిరి బిగపట్టి చూశారు. స్టేడియంలో ఉన్న వాళ్లే కాదు.. టీవీల్లో లైవ్ చూస్తున్న వాళ్లదీ అదే పరిస్థితి. అయితే ఒక పెళ్లి వేడుకల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్‌ను లైవ్ వేశారు.
ఆర్సీబీ విజయం ముంగిటకు రావడం, అదే సమయంలో పెళ్లి ముహూర్తం కూడా ఉండటంతో.. పెళ్లి ఆపేసి మరీ.. వధూవరులతో కలిసి అతిథులు మ్యాచ్ లైవ్ చూశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసి, ఆర్సీబీ గెలిచిందని కన్ఫామ్ చేసుకున్నాకే.. వధూవరులు పెళ్లి చేసుకున్నారు. ఈ విజయంతో ఆర్సీబీకి తొలి ఐపీఎల్ ట్రోఫీ దక్కింది. దీంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా బెంగళూరు నగరంలో టపాసుల మోత మోగిపోయింది. దీపావళిని మించి బెంగళూరులో బాణాసంచ కాల్చినట్లు సమాచారం. ఇంత కాలం ఆర్సీబీని అంటిపెట్టుకొని.. ట్రోఫీ కోసం గత 17 సీజన్లుగా పోరాడుతున్న విరాట్ కోహ్లీ అంతిమంగా ఆ ట్రోఫీని ముద్దాడాడు.
I’m at a wedding, people paused the wedding to watch the finishing moment of @RCBTweets winning the finals! #RCBvsPBKS #EeSalaCupNamde pic.twitter.com/vE9NMH9sm8
— Nikhil Prabhakar (@nikchillz) June 3, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి