న్యూజిలాండ్ క్రికెట్ జట్టు(New Zealand Cricket Team) ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్(Kyle Jamieson) ఈ సంవత్సరం క్వారంటైన్, బయో బబుల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఇంట్లో సమయాన్ని గడపడంతోపాటు తన ఆటను మెరుగుపరచుకోవడానికి ఐపీఎల్ 2022(IPL 2022)తోపాటు, న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ అయిన ప్లాంకెట్ షీల్డ్‌లో తన జట్టు ఆక్లాండ్‌కు దూరంగా ఉంటానని సమాచారం అందించాడు. గతేడాది ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన రెండో ఆటగాడిగా జేమీసన్ నిలిచాడు. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. IPL 2021 వేలంలో అతను రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ సీజన్ అతనికి ప్రత్యేకంగా ఏమీ లేదు. RCB తరపున తొమ్మిది మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అంటే ఆర్సీబీ తరపున అతను ఒక వికెట్‌ను పడగొట్టినందుకు రూ.1.66 కోట్లు అందుకున్నాడు.
జేమీసన్ ఈఎస్‌పీఎన్‌తో మాట్లాడుతూ, ‘నేను చాలా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను. గత పన్నెండు నెలలుగా బయో బబుల్, క్వారంటైన్‌లో ఎక్కువ సమయం గడిపాను. రాబోయే 12 నెలల షెడ్యూల్‌ను పరిశీలిస్తే, ఇప్పుడు నేను కుటుంబంతో గడపాలనుకుంటున్నాను. రెండవది, నేను అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా కొత్త. రెండేళ్లు మాత్రమే అయింది. కాబట్టి నా ఆటపై కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. నేను ఉండాల్సిన స్థాయికి చేరుకోలేకపోయాను. మూడు ఫార్మాట్లలో ఆడాలంటే, ఆటపై చాలా కష్టపడాలి’ అంటూ పేర్కొన్నాడు.
ఐపీఎల్ నుంచి తప్పుకోవడం కఠిన నిర్ణయమే..
ఫిబ్రవరి 2020లో భారత్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జేమీసన్ 12 టెస్టులు, ఐదు వన్డేలు, 8 టీ20లు ఆడాడు. ఐపీఎల్ ఆడకూడదనే నిర్ణయం చాలా కష్టమైన విషయమని, అయితే భవిష్యత్తులో లీగ్‌లో తాను భాగమవుతానని ఆశిస్తున్నట్లు జేమీసన్ తెలిపాడు. ‘ప్రారంభంలో ఇది చాలా కష్టమైన నిర్ణయం. నేను దీని గురించి చాలా ఆలోచించాను. కానీ నేను నా కెరీర్‌పై దృష్టి పెట్టాలని, నా ఆటపై పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపాడు. కైల్ జేమీసన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో ఆడనున్నాడు.
IND vs WI: టీమిండియాకు మరోదెబ్బ.. తొలి వన్డేకు దూరమైన కీలక ప్లేయర్.. కారణం ఏంటంటే?