Video: ఇదెక్కడి మాస్‌ రా మావా..? RCBకి దిష్టి తగలొద్దని.. వీళ్లు చూడండి ఏం చేశారో?

ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. రెండు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. RCB అభిమానులు సోషల్ మీడియాలో తమ జట్టు విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. బెంగళూరులో ఓ అభిమాని తన కారును నిమ్మకాయలు, మిరపకాయలతో అలంకరించి దిష్టి తీసివేసే ప్రయత్నం చేశాడు.

Video: ఇదెక్కడి మాస్‌ రా మావా..? RCBకి దిష్టి తగలొద్దని.. వీళ్లు చూడండి ఏం చేశారో?
Rcb

Updated on: Jun 03, 2025 | 3:57 PM

ఐపీఎల్‌ 2025లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య నేడు ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో ఐపీఎల్‌ ట్రోఫీ కోసం ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్‌ కూడా ఐపీఎల్‌ ట్రోఫీ లేదు. అందుకే ఎలాగైనా ఈ సారి తొలి కప్పు కొట్టాలని ఇటు ఆర్సీబీ, అటు పంజాబ్‌ కింగ్స్‌ పట్టుదలతో ఉన్నాయి. ఆయా టీమ్స్‌ ను అభిమానించే వాళ్లు కూడా తమ అభిమాన జట్టు కప్పు కొట్టాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులైతే సోషల్‌ మీడియాను ఊపేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న టీమ్‌ ఆర్సీబీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఈ సీజన్‌ మొత్తం అద్భుతంగా ఆడి, క్వాలిఫైయర్‌ 1లో ఇదే పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫైనల్‌లో కూడా బాగా ఆడి తమ టీమ్‌ కప్పు కొట్టడం ఖాయమని ఆర్సీబీ అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆర్సీబీకి దిష్టి తగలకుండా ఉండేందుకు బెంగళూరులో ఓ అభిమాని తన కారు నిండా నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి.. యాంటీ నజర్‌(దిష్టి) స్క్వౌడ్‌ అంటూ బోర్డు పెట్టుకొని బెంగళూరు రోడ్లపై హల్‌చల్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆర్సీబీ అభిమానులు కోరుకున్నట్లే ఆర్సీబీకి ఏ దిష్టి తగలకుండా వాళ్లు కప్పు కొడతారో లేదో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..