
భారత స్టార్ ప్లేయర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలి రికార్డుకెక్కాడు. ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో 400 పాయింట్లతో జడేజా మొదటి స్థానంలో ఉండగా 327 పాయింట్లతో బంగ్లాదేశ్‌కు చెందిన మెహదీ హసన్ మీరాజ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 294 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో యన్సెన్ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టాప్ 10లో ఉన్న ఏకైక భారత ఆల్ రౌండర్ జడేజానే.
2024 ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న జడేజా, టెస్ట్ చరిత్రలో నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా ఎక్కువ కాలం కొనసాగిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా 1,151 రోజులు గడిచిన తర్వాత అతను ఇప్పుడు నంబర్ 1 టెస్ట్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు. గత సంవత్సరం మంచి ఫామ్‌లో ఉన్న జడేజా, 29.27 సగటుతో 527 పరుగులు చేశాడు. అదే సమయంలో, అతను 24.29 సగటుతో 48 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..