IPL-2022: ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆ ఆటగాళ్లకు డిమాండ్ ఉంటుంది.. ఆ ప్లేయర్స్ ఎవరంటే..

|

Jan 30, 2022 | 6:18 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ipl-2022) కోసం త్వరలోనే మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు పాల్గొని ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి...

IPL-2022: ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆ ఆటగాళ్లకు డిమాండ్ ఉంటుంది.. ఆ  ప్లేయర్స్ ఎవరంటే..
2. రవిచంద్రన్ అశ్విన్: మాజీ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు ఆర్. అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ కోసం గత కొన్ని ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన కెరీర్‌ను ఘనంగా చాటాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ పంజాబ్ నుంచి ఢిల్లీకి రూ. 7.6 కోట్లకు బదిలీ అయ్యాడు. గత మూడు సీజన్లలో, భారత అనుభవజ్ఞుడైన ఈ స్పిన్నర్ 35 వికెట్లు తీశాడు. దాదాపు 6 ఎకానమీ రేటులో వికెట్లు పడగొట్టాడు.
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ipl-2022) కోసం త్వరలోనే మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు పాల్గొని ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. అయితే భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(ravichandran ashwin) రాబోయే ఐపీఎల్ సీజన్ వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించగల ఇద్దరు ఆటగాళ్లను పేర్కొన్నాడు. ఈ ఆటగాళ్లు ICC U-19 ప్రపంచ కప్‌లో తమ అద్భుతమైన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చారు.

అశ్విన్ పేర్కొన్న ఇద్దరు ఆటగాళ్లు యష్ ధుల్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌పై కూడా అశ్విన్ మాట్లాడాడు. ఈ ప్రపంచకప్‌లో బ్రెవిస్ తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడిని బేబీ ఏబీ డివిలియర్స్ అని పిలుస్తున్నారు.

భారత యువ బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్‌ను ఇషాంత్ శర్మతో అశ్విన్ పోల్చాడు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, “ఈ ఆటగాడిని ఖచ్చితంగా IPL వేలంలో కొనుగోలు చేస్తారు. అతను రైట్ ఆర్మ్ సెంటర్ ఫాస్ట్ బౌలర్, అతను ఇన్స్వింగ్‌లను బాగా విసరగలడు. ప్రస్తుత ఆటగాళ్లలో చూస్తే ఈ బహుమతి అందుకున్న ఏకైక ఆటగాడు ఇషాంత్ శర్మ మాత్రమే. ఇన్స్వింగ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతుంది. అందుకే అతడికి డిమాండ్ ఉంటుందని నేను భావిస్తున్నాను.” అని అశ్విన్ చెప్పాడు. యశ్ ధుల్ చాలా ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్. అని అన్నాడు.
“బ్రీవిస్ బేబీ ఏబీ పేరుతో చాలా ప్రమోట్ అయ్యాడు. అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్‌కు సెలెక్ట్ అవుతారా అని ప్రజలు అతని గురించి అడగడం ప్రారంభించారు. కానీ ఒక్కో జట్టులో ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లకు మాత్రమే చోటు ఉంటుంది. అండర్-19లో ఆడే ఆటగాడికి ఈ స్థానాన్ని ఇస్తారా అనేది ఫ్రాంచైజీలకు పెద్ద ప్రశ్న. కాబట్టి అతను ఎంపిక అవుతాడని నేను అనుకోను.

Read Also… IPL-2022: మహారాష్ట్రలో లీగ్ మ్యాచ్‌లు.. అహ్మదాబాద్‌లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు..