
అక్టోబర్‌లో జరబోయే టీ20 సిరీస్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. హెడ్ కోచ్‌గా తన పదవికాలం ముగిసిన అనంతరం.. మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు రవిశాస్త్రి సుముఖత చూపించట్లేదని వినికిడి. ఇదే విషయాన్ని కొందరు బీసీసీఐ సభ్యులకు రవిశాస్త్రి ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం.
టీ20 ప్రపంచకప్ అనంతరం రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ కూడా ఆయా పదవుల్లో కొనసాగబోవడంలేదని తెలుస్తోంది. రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోయింది. కానీ మూడు ఫార్మాట్లలోనూ బలమైన జట్టుగా ఆవిర్భవించింది. అంతేకాకుండా రిజర్వ్ బెంచ్ కూడా పటిష్టంగా ఉంది.
కాగా, నెక్స్ట్ హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రావిడ్ ఉన్నట్లు సమాచారం. హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉంటుంది. అటు ఎన్‌సీఏ అధ్యక్షుడిగా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం కూడా ముగుస్తోంది. ఎన్‌సీఏకు బదులుగా హెడ్ కోచ్‌కు ద్రావిడ్ దరఖాస్తు చేసుకుంటే.. అతడే ప్రధానంగా రేసులో ఉండే ఛాన్స్ ఉంటుంది.