WTC Final: టీమిండియా భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రవిశాస్తీ..! 4-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్‌ అంటూ..

|

Feb 26, 2023 | 12:33 PM

టీమిండియా మరో మ్యాచ్ విజయం సాధిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడం ఖాయం. ఇక ఆసీస్, టీమిండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ మార్చి 1న..

WTC Final: టీమిండియా భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రవిశాస్తీ..! 4-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్‌ అంటూ..
Ravi Shastri
Follow us on

రెండు సంవత్సరాల క్రితం జరిగిన మొట్టమొదటి టెస్టు ఛాంపియన్‌‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌‌ చేతిలో భారత్  ఓడిపోయింది. అయినా కూడా టీమిండియాకు వరుసగా మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్ ఆడే అవకాశం లభించించడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో ఆసీస్‌ను భారత్ చిత్తు చేసింది. ఇదే తరహాలో టీమిండియా మరో మ్యాచ్ విజయం సాధిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడం ఖాయం. ఇక ఆసీస్, టీమిండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ మార్చి 1న ప్రారంభం కానుంది. అయితే టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్  చేరే అంశంపై భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీని టీమిండియా 4-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్‌తో తలపడినా భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డాడు.

అయితే అదే క్రమంలో ఇంగ్లాండ్‌‌లోని వాతావరణ, పిచ్ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పేసర్లు మరింత ప్రభావం చూపుతారని టీమిండియా ప్లేయర్లకు సూచించాడు. ‘బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 4-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేస్తే అది ప్రత్యర్థిపై మానసికంగా గట్టి ప్రభావం చూపుతుంది. కానీ, ఇంగ్లాండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే గాయాలపాలై జట్టుకు దూరమైన ఫాస్ట్‌బౌలర్లను ఆస్ట్రేలియా అప్పటికి తిరిగి పొందుతుంది. కానీ, ఈ క్లీన్‌స్వీప్‌ విజయం ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో కూడా ఆసీస్‌ను ఓడించగలమనే ఆత్మవిశ్వాసం భారత్‌కు ఇస్తుంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా.. భారత్‌ను ఓడించడం ఆస్ట్రేలియాకు కష్టమైన పని అని, బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని భారత్ 4-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు జూన్‌ 7న లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఒక ఈ టైటిల్‌ పోరులో ప్రస్తుతం బోర్డు లెక్కల ప్రకారం భారత్‌, ఆసీస్‌ తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..