Test Captain: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయస్కులైన కెప్టెన్లు వీరే.. లిస్టులో టీమిండియా ప్లేయర్ కూడా..

|

Nov 23, 2022 | 1:12 PM

క్రికెట్ చరిత్రలో చాలా మంది విజయవంతమైన కెప్టెన్లు ఉన్నారు. అదే సమయంలో చాలా చిన్న వయస్సులో కెప్టెన్లుగా మారిన ఆటగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు.

Test Captain: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయస్కులైన కెప్టెన్లు వీరే.. లిస్టులో టీమిండియా ప్లేయర్ కూడా..
10 Youngest Captains In Test Cricket
Follow us on

క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనైనా కెప్టెన్‌కు మిగతా ఆటగాళ్ల కంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటుంటాయి. ఫీల్డ్‌లో విషయాలను నియంత్రించే వ్యక్తిగా కెప్టెన్‌ని చూస్తుంటాం. దీనితో పాటు, విభిన్న పరిస్థితులలో తన ఆటగాళ్లను సరిగ్గా ఉపయోగించుకునే బాధ్యత కూడా కెప్టెన్‌పై ఉంటుంది. అందుకే కెప్టెన్సీ అంటే అంత తేలికైన పని కాదు.

క్రికెట్ చరిత్రలో చాలా మంది విజయవంతమైన కెప్టెన్లు ఉన్నారు. అదే సమయంలో చాలా చిన్న వయస్సులో కెప్టెన్లుగా మారిన ఆటగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. వీరికి చాలా చిన్న వయస్సులోనే తమ జట్టు కెప్టెన్సీని అప్పగించారు. అయితే టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన 10 మంది కెప్టెన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1.రషీద్ ఖాన్..

అఫ్గానిస్థాన్‌ వెటరన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ టెస్టు చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌. కేవలం 20 ఏళ్ల 350 రోజుల వయసులో కెప్టెన్సీని అందుకున్నాడు. 2019 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

2. తాటెండ తైబు..

జింబాబ్వే దిగ్గజ ఆటగాడు తటెండా తైబు కేవలం 20 ఏళ్ల 358 రోజుల వయసులో కెప్టెన్‌గా మారాడు. అతను హరారేలో శ్రీలంకపై 6 మే 2004న కెప్టెన్సీని పొందాడు.

3. నవాబ్ పటౌడీ..

భారత మాజీ కెప్టెన్ నవాబ్ మసూర్ అలీ ఖాన్ పటౌడీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఆ సమయంలో అతని వయస్సు 21 ఏళ్ల 77 రోజులు.

4. వకార్ యూనిస్..

పాకిస్థాన్ వెటరన్ బౌలర్ వకార్ యూనిస్ కేవలం 22 ఏళ్ల 15 రోజుల వయసులో జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్సీ అవకాశాన్ని అందుకున్నాడు.

5. గ్రేమ్ స్మిత్..

దక్షిణాఫ్రికా మాజీ వెటరన్‌ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే నాటికి అతడి వయసు 22 ఏళ్ల 82 రోజులు మాత్రమే.

6.షకీబ్ అల్ హసన్..

బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 22 ఏళ్ల 115 రోజుల వయసులో కెప్టెన్ అయ్యాడు. అతను 17 జులై 2009న వెస్టిండీస్‌పై మొదటిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

7. ఇయాన్ క్రెయిగ్..

ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ క్రెయిగ్ 22 ఏళ్ల 194 రోజుల వయసులో కెప్టెన్సీని అందుకున్నాడు. అతను 23 డిసెంబర్ 1957న దక్షిణాఫ్రికాపై జోహన్నెస్‌బర్గ్‌లో కెప్టెన్సీ అరంగేట్రం చేశాడు.

8. జావేద్ మియాందాద్..

పాక్‌ వెటరన్‌ జావేద్‌ మియాందాద్‌ 22 ఏళ్ల 260 రోజుల వయసులో కెప్టెన్‌ అయ్యాడు.

9.ముర్రే బిస్సెట్..

ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు 22 ఏళ్ల 306 రోజుల వయసులో కెప్టెన్సీని అందుకున్నాడు.

10.మహమ్మద్ అష్రాఫుల్..

బంగ్లాదేశ్‌ మాజీ వెటరన్‌ ఆటగాడు మహ్మద్‌ అష్రాఫుల్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు అతడి వయసు కేవలం 22 ఏళ్ల 353 రోజులు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..