భారత డొమెస్టిక్ క్రికెట్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ కొనసాగుతోంది. దేశీయంగా అతిపెద్ద క్రికెట్ టోర్నీ అయిన ఇందులో ఒకే రోజు 4 ట్రిపుల్ సెంచరీలు నమోదయ్యాయి. నవంబర్ 13 నుంచి ప్రారంభమైన ఈ టోర్నీలో ప్రస్తుతం 5వ రౌండ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అలాగే నవంబర్ 14న రంజీ ట్రోఫీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ట్రిపుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో 2 ట్రిపుల్ సెంచరీలు ఒకే జట్టు బ్యాట్స్‌మెన్లు సాధించడం విశేషం. ఈ ఆటగాళ్ల ఊచకోతకు బౌలర్లు రక్త కన్నీరు కార్చారు.
ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్
అరుణాచల్ ప్రదేశ్‌తో గోవా 5వ రౌండ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో గోవా తరఫున స్నేహల్ కౌతంకర్, కశ్యప్ బక్లే ట్రిపుల్ సెంచరీలు సాధించారు. విశేషమేమిటంటే ఇద్దరు ఆటగాళ్లు నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో స్నేహల్ కౌతంకర్ కేవలం 215 బంతుల్లో 314 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 4 సిక్సర్లు, 45 ఫోర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 146 కంటే ఎక్కువగా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో అతను 205 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. అదే సమయంలో కశ్యప్ బక్లే కూడా 269 బంతుల్లో అజేయంగా 300 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 39 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శనతో గోవా ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 551 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు
మరోవైపు ఉత్తరాఖండ్, రాజస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో మహిపాల్ లోమ్రోర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మహిపాల్ లోమ్రోర్ 357 బంతుల్లో తన ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ సమయంలో అతడు 13 సిక్సర్లు, 25 ఫోర్లు కొట్టాడు. 360 బంతులు ఆడి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 660 పరుగులు చేసింది.
నాగాలాండ్ బ్యాట్స్‌మెన్ చేతన్ బిష్త్ కూడా ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు. మిజోరాంపై ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో చేతన్ బిష్త్ 423 బంతులు ఆడి అజేయంగా 304 పరుగులు చేశాడు. చేతన్ బిష్త్ ఈ ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతని కెరీర్‌లో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ. చేతన్ బిస్త్ ఈ బలమైన ఇన్నింగ్స్ కారణంగా, నాగాలాండ్ 7 వికెట్ల నష్టానికి 736 పరుగులు చేసి తన మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..