KKR vs RR, IPL 2021: కోల్‌కతా బ్యాట్స్‌మెన్ల దూకుడి ముందు తేలిపోయిన ఆర్‌ఆర్‌ బౌలర్లు.. రాజస్థాన్ ముందు 172 పరుగుల భారీ టార్గెట్

టాస్ ఓడిన కోల్‌కతా టీం నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

KKR vs RR, IPL 2021:  కోల్‌కతా బ్యాట్స్‌మెన్ల దూకుడి ముందు తేలిపోయిన ఆర్‌ఆర్‌ బౌలర్లు.. రాజస్థాన్ ముందు 172 పరుగుల భారీ టార్గెట్
Ipl 2021, Kkr Vs Rr

Updated on: Oct 07, 2021 | 9:31 PM

IPL 2021: ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండవ మ్యాచ్ షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు ముఖ్యమైనది. అయితే టాస్ ఓడిన కోల్‌కతా టీం నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఓపెనర్లు శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్‌లు మంచి ఓపెనింగ్ భ్యాగస్వామ్యాన్ని అందించారు. చూడచక్కని బౌండరీలతో అలరించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాని అందించారు. 10.5 ఓవర్లో రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్(38 పరుగులు, 35 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) బౌల్డయి, తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష రానా(12 పరుగులు, 5 బంతులు, 1 ఫోర్ల, 1 సిక్స్‌) 240 స్ట్రైక్‌ రేట్‌తో పరుగులు సాధించి బౌలర్లపై ఆధిపత్యం చూపించేందుకు సిద్ధమయ్యాడు. కానీ, తాను ఆడిన 5 వ బంతికే భారీ షాట్ ఆడే క్రమంలో లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన త్రిపాఠితో కలిసి ఓపెనర్ శుభ్మన్ గిల్ ధాటిగా పరుగులు సాధించారు. టీం స్కోర్‌ను వంద పరుగులు దాటించారు. ఈ క్రమంలోనే గిల్ తన హాప్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే గిల్(56 పరుగులు, 44 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) క్రిస్ మోరిస్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. గిల్ పెవిలియన్ చేరిన వెంటనే రాహుల్ త్రిపాఠి(21 పరుగులు, 14 బంతులు, 3 ఫోర్లు) కూడా ఔటయ్యాడు. దినేష్ కార్తిక్, కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ పరుగులతో నిలిచి మరో వికెట్ పడకుంగా జగ్రత్త పడ్డారు.

ఇక రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరీస్, చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా, గ్లెన్ పిలిప్స్ తలో వికెట్ పడేశారు.


Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ దృష్టిలో పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్.. అతని బౌలింగ్ స్పీడ్ ఎంతంటే..

IPL 2021, KKR vs RR Live Score: భారీ స్కోర్ చేసిన కోల్‌కతా.. రాజస్థాన్ లక్ష్యం 172.. అర్థ సెంచరీతో ఆకట్టుకున్న గిల్