IPL 2021: తొలి ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టని రాజస్తాన్‌ రాయల్స్

| Edited By: Phani CH

Sep 26, 2021 | 11:00 AM

ఐపీఎల్‎-2021లో రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. ఐపీఎల్ రెండో దశలో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‎తో తలపడిన రాజస్తాన్‌ రాయల్స్ ఓ చెత్త రికార్డు నమోదు చేసింది.

IPL 2021: తొలి ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టని రాజస్తాన్‌  రాయల్స్
Rajasthan Royals
Follow us on

ఐపీఎల్‎-2021లో రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. ఐపీఎల్ రెండో దశలో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‎తో తలపడిన రాజస్తాన్‌ రాయల్స్ ఓ చెత్త రికార్డు నమోదు చేసింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది ఢిల్లీ. ఛేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేసింది. మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ పవర్‌ ప్లే ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఐపీఎల్‌ చరిత్రలో ఒక్క బౌండరీ లేకుండా పవర్‌ ప్లే ముగిసిపోవటం 2011 తర్వాత ఇది రెండోసారి. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరుతో ఉంది.

2011లో కోల్‎కత్తా నైట్‎రైడర్స్‎తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే పవర్‌ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. నిన్న జరిగిన మ్యాచ్‎లో రాజస్తాన్‌ కూడా పవర్‌ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. ఆ తర్వాతి స్థానంలో ముంబయి ఇండియన్స్ 21/3(పంజాబ్‌ కింగ్స్‌పై), చెన్నై సూపర్ కింగ్స్
24/4(ముంబైపై) వరుసగా ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు.. ఆందోళనకు దిగిన బాల్టిస్తాన్ నిరసనకారులు

RR: తొలి ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టని రాజస్తాన్‌ రాయల్స్