Video: లైవ్ మ్యాచ్‌లో ఘోర ప్రమాదం.. కట్‌చేస్తే.. వీల్‌చైర్‌లో మైదానం వీడిన ప్లేయర్..!
Rahmat Shah Leaves the Field in a Wheelchair: అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ అబుదాబిలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆఫ్ఘన్ బ్యాట్స్‌మన్ తీవ్ర గాయపడి వీల్‌చైర్‌లో మైదానం నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది.

Rahmat Shah Leaves the Field in a Wheelchair: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ వన్డే (ODI) మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాట్స్‌మెన్లలో ఒకరైన రహ్మత్ షా కండరాల (Calf) గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది. గాయం తీవ్రత దృష్ట్యా, అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లడానికి వీల్‌చైర్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఇది అభిమానులతోపాటు జట్టును ఆందోళనకు గురిచేసింది.
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. క్రీజులో ఇబ్రహీం జద్రాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న రహ్మత్ షా, పరుగు తీసే సమయంలో ఒక్కసారిగా కుడి కాలు పట్టేయడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. కండరాల నొప్పి (Calf Strain) తీవ్రంగా ఉండటంతో, అతను సొంతంగా నడవలేని పరిస్థితి ఏర్పడింది.
సహాయక సిబ్బంది వెంటనే మైదానంలోకి వచ్చి రహ్మత్‌ను పరీక్షించారు. నొప్పి ఎక్కువగా ఉండటంతో, అతన్ని వీల్‌చైర్‌లో మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. ఈ దృశ్యం అఫ్గాన్ అభిమానులను కలచివేసింది. అతను రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన సమయానికి ఇన్నింగ్స్‌కు ఇంకా చాలా ఓవర్లు మిగిలి ఉన్నాయి.
జట్టుపై ప్రభావం..
Pure dedication from @RahmatShah_08, who put his body on the line for his country, walking out to bat when he could barely walk. 👏👏#AfghanAtalan | #AFGvBAN2025 | #GloriousNationVictoriousTeam pic.twitter.com/BYdM8akhzz
— Afghanistan Cricket Board (@ACBofficials) October 11, 2025
రహ్మత్ షా గాయం, ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్‌కు మరింత ఇబ్బంది కలిగించింది. ఇబ్రహీం జద్రాన్ (95 పరుగులు) ఒకవైపు ఒంటరి పోరాటం చేసినా, మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు చేయాల్సిన సమయంలో రహ్మత్ లేకపోవడం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది. అయినప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్‌కు 190 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగలిగింది.
ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. రషీద్ ఖాన్ మ్యాజిక్‌తో బంగ్లాదేశ్‌ను కేవలం 109 పరుగులకే ఆలౌట్ చేసి 81 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో అఫ్గానిస్తాన్ జట్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
గాయంపై అప్డేట్..
రహ్మత్ షా గాయం ఎంత తీవ్రమైంది, అతను తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అఫ్గానిస్తాన్ జట్టు అతని గాయంపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ విజయం ఆనందాన్ని పక్కనపెడితే, రహ్మత్ షా త్వరగా కోలుకోవాలని జట్టు సభ్యులు, అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




