FIFA World Cup 2022: గోల్డెన్ బూట్ దక్కించుకున్న లక్కీ ప్లేయర్స్ వీరే.. లిస్టులో వారికి నో ప్లేస్..

|

Nov 15, 2022 | 8:32 PM

1982 ఫిఫా ప్రపంచ కప్‌లో ఓ కీలక అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును 2006 ప్రపంచకప్ వరకు గోల్డెన్ షూగా పిలిచేవారు. అయితే, 2010 నుంచి ఈ అవార్డు గోల్డెన్ బూట్‌గా మార్చారు.

FIFA World Cup 2022: గోల్డెన్ బూట్ దక్కించుకున్న లక్కీ ప్లేయర్స్ వీరే.. లిస్టులో వారికి నో ప్లేస్..
Fifa World Cup 2022 Golden Boot Winners
Follow us on

ఫిఫా ప్రపంచ కప్ 2022 నవంబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలిచేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ 32 జట్లు ఖతార్‌లో పోటీ పడబోతున్నాయి. ఈ పెద్ద టోర్నమెంట్‌లో ఓ కీలక అవార్డు కూడా ఇస్తుంటారు. దీని పేరు గోల్డెన్ బూట్. ఫిఫా ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌కు ఈ అవార్డును అందజేస్తారు. ఈ అవార్డు అధికారికంగా 1982 ప్రపంచ కప్‌లో ప్రారంభమైంది. ఈ అవార్డును 2006 ప్రపంచకప్ వరకు గోల్డెన్ షూగా పిలిచేవారు.

ఫిఫా వరల్డ్ కప్ 2010లో, ఈ అవార్డు పేరు గోల్డెన్ బూట్‌గా మార్చారు. ఈ అవార్డును అందుకోవడం అంత ఈజీ కాదనే విషయం తెలిసిందే. 32 జట్లలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు ఈ అవార్డును అందుకుంటాడు. ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు 27 మంది ఆటగాళ్లు ఈ అవార్డును అందుకున్నారు. ఆ పూర్తి జాబితాను ఓసారి చూద్దాం..

గోల్డెన్ బూట్ అవార్డు విజేతల జాబితా..

1930 ఫిఫా ప్రపంచ కప్ – గిల్లెర్మో స్టెబిల్ (అర్జెంటీనా) – 8 గోల్స్

ఇవి కూడా చదవండి

1934 ఫిఫా ప్రపంచ కప్ – ఓల్డెరిచ్ నెజెడ్లీ (చెకోస్లోవేకియా) 5 గోల్స్

1938 ఫిఫా ప్రపంచ కప్ – లియోనిడాస్ (బ్రెజిల్) – 7 గోల్స్

1950 ఫిఫా ప్రపంచ కప్ – అడెమిర్ (బ్రెజి) – 8 గోల్స్

1954 ఫిఫా ప్రపంచ కప్ – సాండర్ కోకాక్స్ (హంగేరి) – 11 గోల్స్

1958 ఫిఫా ప్రపంచ కప్ – జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్) – 13 గోల్స్

1962 ఫిఫా ప్రపంచ కప్ – ఫ్లోరియన్ ఆల్బర్ట్ (హంగేరీ), వాలెంటిన్ ఇవనోవ్ (రష్యా), గారించా, వావా (బ్రెజిల్), డ్రాసన్ జెర్కోవిచ్ (క్రొయేషియా), లియోనెల్ సాంచెజ్ (చిలీ) – 4 గోల్స్

1966 ఫిఫా ప్రపంచ కప్ – ఇసెబియో (పోర్చుగల్) – 9 గోల్స్

1970 ఫిఫా ప్రపంచ కప్ – గెరాడ్ ముల్లర్ (జర్మనీ) – 10 గోల్స్

1974 ఫిఫా ప్రపంచ కప్ – గ్ర్జెగోర్జ్ లాటో (పోలాండ్) – 7 గోల్స్

1978 ఫిఫా ప్రపంచ కప్ – మారియో క్యాంప్స్ (అర్జెంటీనా) – 6 గోల్స్

1982 ఫిఫా ప్రపంచ కప్ – పాలో రోస్సీ (ఇటలీ) – 6 గోల్స్

1986 ఫిఫా ప్రపంచ కప్ – గైరీ లినేకర్ (ఇంగ్లండ్) – 6 గోల్స్

1990 ఫిఫా ప్రపంచ కప్ – సాల్బేటర్ సిలాచ్చి (ఇటలీ) – 6 గోల్స్

1994 ఫిఫా ప్రపంచ కప్ – ఒలేగ్ సాలెంకో (రష్యా), హ్రిస్టో స్టోయిచ్కోవ్ (బల్గేరియా) – 6 గోల్స్

1998 ఫిఫా ప్రపంచ కప్ – దావర్ సుకర్ (క్రొయేషియా) – 6 గోల్స్

2002 ఫిఫా ప్రపంచ కప్ – రొనాల్డో నరాజియో (బ్రెజిల్) – 8 గోల్స్

2006 ఫిఫా ప్రపంచ కప్ – మిరోస్లావ్ క్లోస్ (జర్మనీ) – 5 గోల్స్

2010 ఫిఫా ప్రపంచ కప్ – థామస్ ముల్లర్ (జర్మనీ) – 6 గోల్స్

2014 ఫిఫా ప్రపంచ కప్ – జేమ్స్ రోడ్రిగ్స్ (కొలంబియా) – 6 గోల్స్

2018 ఫిఫా ప్రపంచ కప్ – హ్యారీ కేన్ (ఇంగ్లండ్) – 6 గోల్స్.

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ నవంబర్ 20 నుంచి ఖతార్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఫుట్‌బాల్ మహోత్సవంలో 32 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.3568 కోట్లకు చేరింది. విజేత జట్టుకు రూ.344 కోట్లు అందనుండగా, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.245 కోట్లు లభిస్తాయి.