
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో పంజాబ్ ఆడిన 11 మ్యాచుల్లో 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే పంజాబ్ జట్టులో అందరూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ మ్యాక్స్‌వెల్ మాత్రం అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ తరుపున 7 మ్యాచులు ఆడిన మ్యాక్స్‌వెల్ కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మ్యాక్స్ వెల్ ఆట తీరుపై అటు అభిమానులతో పాటు జట్టు యాజమాన్యం కూడా అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ ఫామ్ గురించి పంజాబ్ ఓనర్ ప్రీతి జింటాను ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇటీవల ‘ఎక్స్’ వేదికగా నిర్వహించిన ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఓ కార్యక్రమంలో పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా పాల్గొంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ ఫామ్‌పై స్పందిస్తూ ఇలా కామెంట్ చేశాడు. మేడమ్.. మీరు గతంలో మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదనే… ఇప్పుడు అతను మీ జట్టులో సరిగ్గా ఆడటం లేదు కదా అంటూ అసభ్యకరంగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్ తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రీతి జింటా అ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
Will you ask this question to the male team owners of all teams, or is this discrimination just towards the women? I never knew how difficult it is for women to survive in corporate setups until I got into cricket. I’m sure you asked this question out of humour, but I hope you… https://t.co/cBX4SbqAwS
— Preity G Zinta (@realpreityzinta) May 13, 2025
నెటిజన్ కామెంట్‌కు ప్రీతి జింటా రిప్లే ఇస్తూ ఇలా అంది.. నేను మహిళను కాబట్టి ఇలా అడుగుతున్నావు.. అదే మిగతా ఐపీఎల్ ఫ్రాంఛైజీల పురుష యజమానులను కూడా నువ్వు ఇదే ప్రశ్న అడగగలవా? అని ప్రశ్నించింది. మీరు మాట్లాడుతున్న తీరు మహిళల పట్ల వివక్ష చూపే విదంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మహిళ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, కార్పొరేట్ స్థాయిలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో నీకు తెలుసా.. గత 18 ఏళ్లుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నాను. ఇన్నేళ్లుగా నేను కష్టపడి సాధించుకున్న పేరుకైన కాస్త గౌరవం ఇవ్వండి. మాట్లాడేటప్పుడు కాస్తా ఆలోచించి మాట్లాడండి అంటూ ఆ నెటిజన్ కామెంట్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది ప్రీతి జింటా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..