RCB vs PBKS, IPL 2021: డబుల్ హెడర్స్‌లో భాగంగా తొలి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ టీం తలపడుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆర్‌సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ((25 పరుగులు, 24 బంతులు, 2 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (40 పరుగులు, 38 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. 9.4 ఓవర్లో హెన్రిక్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బౌల్డ్ అయ్యి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆవెంటనే క్రీజులోకి వచ్చిన డానియల్ క్రిస్టియన్ (0) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే పడిక్కల్ కూడా హెన్రిక్స్ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 11.4 ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఏబీ డివిలియర్స్ ఆర్‌సీబీకి కీలకమైన 73 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, 18.2 ఓవర్లో డివిలియర్ (23) రన్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఇక మ్యాక్స్‌వెల్ ఆర్‌సీబీ తరుపున కీలక ఇన్నింగ్స్ ఆడి, భారీ స్కోర్ చేసేందుకు సహాయపడ్డాడు. కేవలం 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సుల సహాయంతో 170కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 57 పరుగులు చేశాడు. మంచి ఊపు మీదున్న మ్యాక్స్‌వెల్ చివరి ఓవర్‌లో షమీ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అనంతరం ఆర్‌సీబీ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. అహ్మద్, గార్టన్ వరుస బంతుల్లో ఔటయ్యారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హెన్రిక్స్, షమీ తలో 3 వికెట్లు పడగొట్టాడు.
A 2⃣9⃣-ball half-century! ? ?@Gmaxi_32 is on a roll with the bat here in Sharjah! ? ? #VIVOIPL #RCBvPBKS @RCBTweets
Follow the match ? https://t.co/0E5ehhSWRx pic.twitter.com/Jd4PLMdjYO
— IndianPremierLeague (@IPL) October 3, 2021
WICKET No. 3⃣ for @Mozzie21! ? ?
Three quick strikes from @PunjabKingsIPL! ? ?
Devdutt Padikkal departs. #VIVOIPL #RCBvPBKS
Follow the match ? https://t.co/0E5ehhSWRx pic.twitter.com/alpxb8hCWs
— IndianPremierLeague (@IPL) October 3, 2021
Also Read: RCB vs PBKS Live Score, IPL 2021: ఆరంభం అదిరినా.. చివర్లో తడబడిన ఆర్‌సీబీ.. పంజాబ్ టార్గెట్ 165