
ఐపీఎల్లో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లకు 143 పరుగులు సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జీటీ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు సత్తా చాటటడంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. రబడా 4 వికెట్లతో చెలరేగడంతో పంజాబ్ ఆధిపత్యం చూపించింది. అర్షదీప్, రిషి ధావన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.
రబడా ప్రమాదకరమైన బౌలింగ్..
ఈ మ్యాచ్‌లో కగిసో రబడా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు పడగొట్టాడు. అతను వరుసగా రెండు బంతుల్లో రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్‌లను పెవిలియన్ చేర్చాడు.
Also Read: IPL 2022 Final Match: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై జైషా కీలక ప్రకటన.. ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందంటే?