
Ubaid Shah Accidentally Slapped Usman Khan Video: పాకిస్తాన్‌లో జరుగుతున్న టీ20 లీగ్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 22న ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. వికెట్ తీసిన ఆనందంలో ఓ ప్లేయర్ సెలబ్రేషన్స్‌లో చిన్న అవశృతి చోటు చేసుకుంది. అనుకోకుండా చేయి తగలడంతో ఓ ఆటగాడు గాయపడ్డాడు. అయితే, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అయినప్పటికీ ఆ పొరపాటు మరో ఆటగాడిని కిందపడిపోయేలా చేసింది. ఈ విషయం ముల్తాన్ సుల్తాన్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఒబైద్ షా, ఉస్మాన్ ఖాన్‌లకు సంబంధించినది.
ఈ సంఘటన లాహోర్ ఖలందర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జరిగింది. ఈ ఓవర్ చివరి బంతికి ఒబైద్ షా సామ్ బిల్లింగ్స్ వికెట్ తీసుకున్నాడు. సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్‌కు హై-ఫైవ్ ఇవ్వడానికి వెళ్ళాడు. కానీ, అతను దానిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో చేయి కాస్త అతని తలపై నేరుగా తగిలింది. ఈ సంఘటనలో ఉస్మాన్ ఖాన్‌కు స్వల్ప గాయమైంది. దీంతో అతను నేలపై పడిపోయాడు.
Rey 🤣🤣😭 pic.twitter.com/oj59d8N8H6
— Yaghnesh (@Yaghnesh1) April 22, 2025
అయితే, మంచి విషయం ఏమిటంటే వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ఆ తర్వాత ఆటను కొనసాగించాడు. ఆ సంఘటన తర్వాత అతను మ్యాచ్‌లో ఒక క్యాచ్ కూడా తీసుకున్నాడు. ఒబైద్ షా గురించి చెప్పాలంటే, ఆ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 37 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో సామ్ బిల్లింగ్స్ అతని చివరి బాధితుడిగా మారాడు.
Ubaid Shah dismisses Sam Billings and knocks out Usman Khan in the process! pic.twitter.com/x18JyZGem5
— PakPassion.net (@PakPassion) April 22, 2025
ఒబైద్ షా, ఉస్మాన్ ఖాన్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ జట్టు లాహోర్ ఖలందర్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. ఇందులో ఉస్మాన్ ఖాన్ 24 బంతుల్లో 39 పరుగులు చేశాడు. 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు మాత్రమే చేసింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..