PSL 2025: పాకిస్తాన్ నుంచి పీఎస్‌ఎల్ షిఫ్ట్.. మిగిలిన మ్యాచ్‌లు జరిగేది ఎక్కడంటే?

PSL 10లో మిగిలిన మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. భారతదేశం నుంచి ఎదురుదాడికి భయపడిన పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌లోని లాహోర్, రావల్పిండి, ముల్తాన్‌లలో PSL మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. రద్దు చేస్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని, దుబాయ్‌కి మార్చారు.

PSL 2025: పాకిస్తాన్ నుంచి పీఎస్‌ఎల్ షిఫ్ట్.. మిగిలిన మ్యాచ్‌లు జరిగేది ఎక్కడంటే?
Psl

Updated on: May 09, 2025 | 9:03 AM

PSL 2025: భారత ప్రతీకార చర్యతో పాకిస్తాన్ భయపడుతోంది. పీసీబీ భయంతో బిక్కుబిక్కుముంటోంది. దీంతో పీఎస్‌ఎల్ (PSL 2025) మిగిలిన మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో నిర్వహించకూడదని నిర్ణయించుకుంది. PSL 10లో మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ తెలిపింది. లీగ్‌లో ఇంకా 8 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లలో జరగాల్సి ఉంది. కానీ, ఈ మూడు నగరాల్లో భారత్ బలమైన చర్యల దృష్ట్యా, PCB PSL ను దుబాయ్‌కు మార్చాలని నిర్ణయించింది.

భారత దాడులతో పీసీబీ ఆగమాగం..

భారతదేశం ఇప్పటికే డ్రోన్లతో దాడి చేసి రావల్పిండి క్రికెట్ స్టేడియంను ధ్వంసం చేసింది. ఈ కారణంగా, మే 8న కరాచీ కింగ్స్ వర్సెస్ పెషావర్ జల్మి మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దు చేశారు. ఆ తరువాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీఎస్‌ఎల్ అన్ని మ్యాచ్‌లను కరాచీలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ రాత్రంతా, భారతదేశం పాకిస్తాన్‌లోని అనేక నగరాలను లక్ష్యంగా చేసుకుంది. అందులో లాహోర్ మాత్రమే కాదు, కరాచీ కూడా ఉంది.

ఆటగాళ్ల భద్రత కోసం దుబాయ్‌కి షిప్ట్..

పాకిస్తాన్ పై భారత్ దాడి చేయడం చూసి, PSL లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఆటగాళ్ల భద్రత తమకు ముఖ్యమని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అన్నారు. రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారతదేశం చేసిన దాడిని బాధ్యతారాహిత్యంగా అభివర్ణించిన ఆయన.. ఆ దుర్మార్గపు చర్యను మొదట పాక్ దేశం, ప్రభుత్వం చేసిందని మర్చిపోవడం గమనార్హం. భారతదేశం చేసింది కేవలం ప్రతీకార చర్యలు మాత్రమేనని మర్చిపోయి మాట్లాడాడు.

ఇవి కూడా చదవండి

భారత దాడితో భయపడ్డారా?

దేశం వెలుపల దుబాయ్‌లో PSL నిర్వహించాలని PCB నిర్ణయించిందని మొహ్సిన్ నఖ్వీ అన్నారు. ఈ లీగ్‌లో ఆడుతున్న ఆటగాళ్లను రక్షించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలను, క్రీడలను వేరుగా ఉంచాలని కోరుకుంటున్నట్లు పీసీబీ తన నిర్ణయంలో తెలిపింది. అయితే, నిజం ఏమిటంటే భారతదేశం దాడి కారణంగా PSL రద్దు చేస్తే, పాక్ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..