PSL 2022: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వివాదం.. ఆస్ట్రేలియా క్రికెటర్ తీవ్ర ఆరోపణలు.. ఆగ్రహంతో ఏం చేశాడంటే?

ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్క్‌నర్‌కు సంబంధించిన వివాదం పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను పెద్ద చిక్కుల్లోకి నెట్టింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)

PSL 2022: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వివాదం.. ఆస్ట్రేలియా క్రికెటర్ తీవ్ర ఆరోపణలు.. ఆగ్రహంతో ఏం చేశాడంటే?
Psl 2022 Australian Cricketer James Faulkner

Updated on: Feb 20, 2022 | 7:44 AM

Australian Cricketer James Faulkner: పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2022) ఆరో సీజన్ ప్రస్తుతం చివరి రౌండ్‌కు చేరుకుంది. ఈసారి కరోనా లేదా ఉగ్రవాద దాడి భయంతో లీగ్ ఆగిపోలేదు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్క్‌నర్‌కు సంబంధించిన వివాదం పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను పెద్ద చిక్కుల్లోకి నెట్టింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) జీతం చెల్లించడం లేదని ఫాల్క్‌నర్ ఆరోపించారు. ఆగ్రహంతో హోటల్‌లో అమర్చిన షాన్డిలియర్‌పై బ్యాట్‌, హెల్మెట్‌ కూడా విసిరాడు. దీంతో పీసీబీ ఫాల్క్‌నర్ వాదనతో సిరీయస్‌గా తీసుకుని భవిష్యత్తులో అతన్ని పీఎస్‌ఎల్ ఆడకుండా నిషేధించింది. ఇలాంటి ఆరోపణలు చేయడం తప్పు అని పేర్కొంది.

లీగ్ నుంచి వైదొలిగిన ఫాల్క్‌నర్, 31 ఏళ్ల ఆస్ట్రేలియా ఆటగాడు శనివారం తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వరుసగా రెండు ట్వీట్లు చేశాడు. పీసీబీ ప్లేయర్లకు డబ్బు చెల్లించడంలేదని ఆరోపించారు. దీని తర్వాత అతను లీగ్‌ను మధ్యలోనే వదిలేస్తున్నట్లు ప్రకటించాడు.

ఫాల్క్‌నర్‌ను బ్లాక్‌మెయిలింగ్ చేశారని పీసీబీ ఆరోపించింది. ఫాల్క్‌నర్‌కు 70 శాతం డబ్బు ఇచ్చామని, మిగిలిన మొత్తం త్వరలో ఇస్తామని పీసీబీ తెలిపింది. దీనితో పాటు, భవిష్యత్తులో ఫాల్క్‌నర్‌ను పీఎస్‌ఎల్‌లో చేర్చకూడదని పీసీబీ పేర్కొంది.

ఫాల్క్‌నర్ మాట్లాడుతూ – ‘అంతర్జాతీయ క్రికెట్‌ను పాకిస్తాన్‌కు తిరిగి తీసుకురావడానికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. కాబట్టి లీగ్‌ను విడిచిపెట్టడం విచారకరం. ఇక్కడ పెద్ద సంఖ్యలో యువ ప్రతిభావంతులు ఉన్నారు. ఇక్కడి అభిమానులు కూడా అద్భుతంగా ఉన్నారు. కానీ, నేను ప్రవర్తించిన తీరు అవమానకరంగా ఉంది’ అంటూ పేర్కొన్నాడు.

Also Read: దోషిగా తేలితే ఆ ప్లేయర్‌ IPL కాంట్రాక్ట్ రద్దవుతుందా.. క్రికెట్‌ ఆడకుండా నిషేధిస్తారా..?

Ipl 2022 Auction: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు కొత్త అసిస్టెంట్‌ కోచ్‌.. సైమన్‌ కటిచ్‌ స్థానంలో ఎవరు రానున్నారంటే..