PKL 2024: పాయింట్ల పట్టికలో భారీ మార్పులు.. హోమ్ లెగ్‌లో సత్తా చాటిన పాట్నా పైరేట్స్..

పాట్నా లెగ్ తర్వాత, PKL 10 తదుపరి దశ ఫిబ్రవరి 2 నుంచి 7 వరకు ఢిల్లీలో జరుగుతుంది. ఇక్కడ సొంత జట్టు ఢిల్లీ, వారితో పాటు పుణెరి పల్టన్‌తో ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవాలని చూస్తుంది. PKL 10 ప్లేఆఫ్‌లు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఇందులో రెండు ఎలిమినేటర్‌లు ఫిబ్రవరి 26న జరగనున్నాయి. ఆ తర్వాత రెండు సెమీ-ఫైనల్‌లు ఫిబ్రవరి 28న, ఫైనల్‌ మార్చి 1న జరగనున్నాయి.

PKL 2024: పాయింట్ల పట్టికలో భారీ మార్పులు.. హోమ్ లెగ్‌లో సత్తా చాటిన పాట్నా పైరేట్స్..
Pkl 2024

Updated on: Feb 02, 2024 | 7:56 AM

PKL 2024: పీకేఎల్ 10 (Pro Kabaddi 2023) పాట్నా లెగ్ జనవరి 26 నుంచి 31 వరకు జరిగింది. ఇందులో మొత్తం 11 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో ఆతిథ్య జట్టు పాట్నా పైరేట్స్ 4 మ్యాచ్‌లు ఆడింది. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమిని ఎదుర్కోలేదు. హోమ్ లెగ్‌లోని 4 మ్యాచ్‌లలో 2 విజయాలు, 2 టైలతో, పాట్నా పైరేట్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం నుంచి నాల్గవ స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే వారి ఆశలు ఇప్పుడు చాలా పెరిగాయి. PKL 10 పాట్నా లెగ్‌లో పాట్నా పైరేట్స్‌తో పాటు, జైపూర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్ సత్తా చాటాగుతున్నాయి.

పాట్నా లెగ్ మొదటి రోజు, పాట్నా పైరేట్స్ మొదటి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌ను 44-28తో ఓడించి శుభారంభం చేసింది. అదే రోజు జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 44-35తో యూ ముంబాను ఓడించి టాప్ 6లో నిలవాలన్న యూ ముంబా ఆశలకు పెద్ద దెబ్బ వేసింది. రెండో రోజు పాట్నా పైరేట్స్, పుణెరి పల్టాన్ మధ్య మ్యాచ్ 32-32తో టై కావడంతో ఫామ్‌లో ఉన్న పుణె జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 36-27తో యూపీ యోధాస్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని పటిష్టం చేసుకుంది.

మూడో రోజు ఆటలో బెంగళూరు బుల్స్ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను 28-28తో టై చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు తమిళ్ తలైవాస్ 50-34తో యూ ముంబాను ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. నాలుగో రోజు హర్యానా స్టీలర్స్ 41-36తో బెంగాల్ వారియర్స్‌పై, పాట్నా పైరేట్స్ 32-20తో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించాయి. ఐదో రోజు ఏకైక మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 60-29తో తెలుగు టైటాన్స్‌ను ఓడించి మొదటి స్థానానికి చేరుకుంది.

అయితే, పాట్నా లెగ్ చివరి రోజున, పాట్నా పైరేట్స్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. బెంగళూరు బుల్స్‌తో 29-29 స్కోరుతో టైతో సరిపెట్టుకోవలసి వచ్చింది. చివరి మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 42-27తో తమిళ్ తలైవాస్‌ను ఓడించి ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.

పాట్నా లెగ్‌లో సొంత జట్టు పాట్నా పైరేట్స్‌తో పాటు జైపూర్ పింక్ పాంథర్స్ (1 విజయం, 1 టై), పుణెరి పల్టాన్ (1 విజయం, 1 టై) విజయవంతమయ్యాయి. ఇది కాకుండా, బెంగళూరు బుల్స్ (2 టై) కూడా ఈ లెగ్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్ కూడా తమ ఏకైక మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. గుజరాత్ జెయింట్స్ 2 మ్యాచ్‌లు గెలిచి 1 మ్యాచ్‌లో ఓడిపోయింది.

పాట్నా లెగ్‌లో యు ముంబా, బెంగాల్ వారియర్స్ తమ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, తమిళ్ తలైవాస్ 2 మ్యాచ్‌లు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్, యూపీ యోధాలు ఒక్కో మ్యాచ్‌లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి 2 స్థానాల్లో ఉన్నాయి.

పాట్నా లెగ్ తర్వాత, PKL 10 తదుపరి దశ ఫిబ్రవరి 2 నుంచి 7 వరకు ఢిల్లీలో జరుగుతుంది. ఇక్కడ సొంత జట్టు ఢిల్లీ, వారితో పాటు పుణెరి పల్టన్‌తో ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవాలని చూస్తుంది. PKL 10 ప్లేఆఫ్‌లు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఇందులో రెండు ఎలిమినేటర్‌లు ఫిబ్రవరి 26న జరగనున్నాయి. ఆ తర్వాత రెండు సెమీ-ఫైనల్‌లు ఫిబ్రవరి 28న, ఫైనల్‌ మార్చి 1న జరగనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..