KKR vs PBKS: అలా కొట్టారేంట్రా బాబు.. అతనో మిస్టరీ స్పినర్‌ రా! పంజాబ్‌ ఓపెనర్ల ఊచకోత

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించి, పంజాబ్ భారీ స్కోర్‌ సాధించేందుకు మార్గం సుగమం చేశారు.

KKR vs PBKS: అలా కొట్టారేంట్రా బాబు.. అతనో మిస్టరీ స్పినర్‌ రా!  పంజాబ్‌ ఓపెనర్ల ఊచకోత
Priyansh Arya And Prabhsimr

Updated on: Apr 26, 2025 | 9:19 PM

ఐపీఎల్‌ 2025లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాన్ష్‌ ఆర్య, ప్రభు సిమ్రాన్‌ సింగ్‌ అదిరిపోయే స్టార్ట్‌ అందించారు. ఇద్దరు కూడా పోటీ పడి మరీ సిక్సర్ల వర్షం కురిపించారు. ఇప్పటికే ఈ సీజన్‌లో పాల బుగ్గల కుర్రాడు పియాన్ష్‌ ఆర్య సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీ చేస్తాడేమో అనేంత భయంకరంగా బ్యాటింగ్‌ చేశాడు. అలాగే ప్రభు సిమ్రాన్‌ సింగ్‌ సైతం ఏ మాత్రం తగ్గలేదు.

ఇద్దరు రెండు వైపుల నుంచి కేకేఆర్‌ను ఊచకోత కోశారు. ప్రభుసిమ్రాన్‌ అయితే మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌ స్విచ్‌ హిట్‌తో భారీ సిక్స్‌ కొట్టాడు. మొత్తంగా ప్రియాన్ష్‌ ఆర్య 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులు చేసి రస్సెల్‌ బౌలింగ్‌లో వైభవ్‌ అరోరాకు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఇక ప్రభుసిమ్రాన్‌ సింగ్‌ 49 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. వైభవ్‌ అరోరా వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ మూడో బంతికి పొవెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 120 పరుగుల భారీ స్కోర్‌ జోడించారు. వీరిద్దరి విధ్వంసంతో పంజాబ్‌ కింగ్స్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..