Prithvi Shaw: ఆస్ట్రేలియా టెస్ట్‌లో వరుసగా విఫలమవుతున్న ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లోకెక్కాడు. నాలుగో టెస్ట్‌లో పొరపాటు చేసి రోహిత్ శర్మ కోపానికి గురయ్యాడు. తొలి టెస్టులో టెక్నిక్ లోపంతో వరుసగా క్లీన్‌బౌల్డయ్యాడు. అంతేగాక ఫీల్డింగ్‌లో చురుకుదనం లేక క్యాచ్‌లను నేలపాలు చేశాడు. దీంతో తుదిజట్టులో చోటు కోల్పోయాడు. అయితే నాలుగో టెస్ట్‌లో మరో పొరపాటు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. తొడకండరాలు పట్టేయడంతో నవదీప్ సైని మైదానాన్ని వీడాడు.
అతడి స్థానంలో షా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. సుందర్ వేసిన 53వ ఓవర్‌లో లబుషేన్ మిడ్‌వికెట్ మీదగా షాట్ ఆడి పరుగుకు ప్రయత్నించాడు. కాగా, షా బంతిని అందుకుని రనౌట్ చేసే క్రమంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు త్రో విసిరాడు. అయితే ప్రత్యర్థిని ఔట్ చేయాలనే తొందరలో త్రో విసిరే మార్గంలో రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్నాడనే విషయాన్ని షా మరిచాడు. దీంతో బంతి హిట్‌మ్యాన్ వైపునకు దూసుకెళ్లింది. కాగా, రోహిత్ అప్రమత్తమై తొడకు తగలాల్సిన ఆ బంతిని చేతులతో ఆపడానికి ప్రయత్నించాడు. చేతి వేళ్లకు బంతి బలంగా తాకింది. దీంతో షా వైపు రోహిత్ అసహనంతో చూశాడు. దీంతో పృథ్వీ షాపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
⚠ Friendly fire ⚠
Live #AUSvIND: https://t.co/IzttOVtrUu pic.twitter.com/8naJ3ykMe7
— cricket.com.au (@cricketcomau) January 15, 2021