Video: ఏంది బ్రో ఇలా చేశావ్.. జట్టులో చోటిస్తే గంభీర్‌కే మెంటలెక్కించావ్.. 148 ఏళ్ల చెత్త రికార్డుతో..

Prasidh Krishna, IND vs ENG: బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మూడో రోజున ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణ పేరు మీద ఒక చెడ్డ రికార్డు నమోదైంది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జామీ స్మిత్ కృష్ణ వేసిన ఒక ఓవర్‌లో సిక్స్, నాలుగు ఫోర్లు కొట్టాడు. 2000 తర్వాత టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 23 పరుగులు ఇచ్చిన నాల్గవ బౌలర్‌గా నిలిచాడు.

Video: ఏంది బ్రో ఇలా చేశావ్.. జట్టులో చోటిస్తే గంభీర్‌కే మెంటలెక్కించావ్.. 148 ఏళ్ల చెత్త రికార్డుతో..
Ind Vs Eng Prasidh Krishna

Updated on: Jul 05, 2025 | 9:50 AM

Prasidh Krishna: భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 148 ఏళ్ల చరిత్రలో కనీసం 500 బంతులు వేసిన బౌలర్లలో అత్యధిక ఎకానమీ రేటు (5.17)ను నమోదు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా, ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఒకే ఓవర్లో ఏకంగా 23 పరుగులు సమర్పించుకోవడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

ఒకే ఓవర్లో 23 పరుగులు – నెటిజన్ల ఆగ్రహం:

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 32వ ఓవర్‌లో జేమీ స్మిత్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో 4, 6, 4, 4, ఒక వైడ్, చివరి బంతికి మరో 4 సహా మొత్తం 23 పరుగులు రాబట్టాడు. దీంతో అప్పటిదాకా కట్టుదిట్టంగా ఉన్న ఇంగ్లాండ్ స్కోరు బోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. ఈ ఓవర్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. “ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రో?” అంటూ అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేశారు. టెస్ట్ క్రికెట్ లో ఇంత ధారాళంగా పరుగులు ఇవ్వడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అనేకమంది అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

చెత్త రికార్డుల పరంపర..

ప్రసిద్ధ్ కృష్ణ డిసెంబర్ 2023లో దక్షిణాఫ్రికాతో టెస్ట్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను ఆడిన ఐదు టెస్టులలో నిలకడైన ప్రదర్శన కనబరచలేకపోయాడు. తొలి టెస్ట్ లో 5 వికెట్లు తీసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 20 ఓవర్లలో 128 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 15 ఓవర్లలో 92 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టులో అతని ఎకానమీ రేటు 5.50కి చేరుకోవడం గమనార్హం.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులు వేసిన బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ అత్యధిక ఎకానమీ రేటును నమోదు చేయడం క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఈ జాబితాలో వరుణ్ అరోన్ (భారత్), షహదత్ హొస్సేన్ (బంగ్లాదేశ్), ఆర్పీ సింగ్ (భారత్) వంటి బౌలర్లు కూడా ఉన్నప్పటికీ, ప్రసిద్ధ్ కృష్ణ వారిని అధిగమించి ఈ చెత్త రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు.

సెలక్టర్ల మద్దతు ప్రశ్నార్థకం..

ప్రసిద్ధ్ కృష్ణకు సెలక్టర్లు, టీమ్ మేనేజ్ మెంట్ నుంచి గట్టి మద్దతు ఉందని తరచుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన అతను, ఐపీఎల్ 2025 సీజన్ లో పర్పుల్ క్యాప్ గెలుచుకోవడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నప్పటికీ, టెస్ట్ క్రికెట్ లో మాత్రం అది ప్రతిఫలించట్లేదని విమర్శకులు అంటున్నారు. అతని బౌలింగ్ లో వేగం ఉన్నప్పటికీ, సరైన లైన్ అండ్ లెంగ్త్ ను కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నాడని, ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులు తేలికగా పరుగులు ఇస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వరుస పేలవ ప్రదర్శనల నేపథ్యంలో, మూడో టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. టీమిండియా మేనేజ్ మెంట్ అతని ప్రదర్శనను ఎలా అంచనా వేస్తుంది, భవిష్యత్తులో అతనికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది అనేది వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..