Sachin Tendulkar: సచిన్‎కు బౌలింగ్ చేయాలంటే భయమేసింది.. సఫారీ మాజీ బౌలర్ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Dec 28, 2021 | 9:11 PM

సెంచూరియన్‎లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ 2వ రోజు కోసం ఎదురుచూస్తుండగా, బ్రాడ్‌కాస్టర్లు దక్షిణాఫ్రికాలో భారత బ్యాటర్ ఆడిన అత్యంత ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌లలో ఒకటైన సచిన్ టెండూల్కర్ 50వ టెస్ట్ సెంచరీని ప్రసారం చేసారు...

Sachin Tendulkar: సచిన్‎కు బౌలింగ్ చేయాలంటే భయమేసింది.. సఫారీ మాజీ బౌలర్ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sachin
Follow us on

సెంచూరియన్‎లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ 2వ రోజు కోసం ఎదురుచూస్తుండగా, బ్రాడ్‌కాస్టర్లు దక్షిణాఫ్రికాలో భారత బ్యాటర్ ఆడిన అత్యంత ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌లలో ఒకటైన సచిన్ టెండూల్కర్ 50వ టెస్ట్ సెంచరీని ప్రసారం చేసారు. భారత మాజీ బ్యాటర్ 2010లో ఇదే మైదానంలో సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాలో టెండూల్కర్‌కు మంచి రికార్డు ఉంది. దిగ్గజ బ్యాటర్ రెయిన్‌బో దేశంలో ఆరుసార్లు పర్యటించి ఆరు సెంచరీలు చేశాడు. అతను 1992లో జోహన్నెస్‌బర్గ్‌లో 111 పరుగులు చేశాడు. ఆ తర్వాత 1996లో కేప్‌టౌన్‌లో 169 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఐదేళ్ల తర్వాత, జోహన్నెస్‌బర్గ్‌లో టెండూల్కర్ 155 పరుగులు చేశాడు. 2007/06లో అతను సెంచరీ చేయనప్పటికీ, భారత మాజీ కెప్టెన్‎గా అబ్బురపరిచాడు. తన సౌతాఫ్రికా చివరి పర్యటనలో రెండు సెంచరీలతో ఆకట్టుకున్నాడు..

2006/07 పర్యటనలో భారత్ దక్షిణాఫ్రికాతో డర్బన్‌లో తలపడింది. యువకుడు మోర్నే మోర్కెల్ ఆ మ్యాచ్‎లో అరంగేట్రం చేశాడు. అతను వేసిన మొదటి బంతి సచిన్ టెండూల్కర్‎కు వేశాడు. దక్షిణాఫ్రికా అత్యుత్తమ టెస్ట్ బౌలర్లలో ఒకరిగా పదవీ విరమణ చేసిన మోర్కెల్, తన అరంగేట్రంలోనే భయాందోళనకు గురయ్యాడని వెల్లడించాడు. గొప్ప టెండూల్కర్‌కు బౌలింగ్ చేయడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభినని చెప్పాడు. “నేను 2006లో అరంగేట్రం చేసినప్పుడు… నేను నా మొదటి ఓవర్‌ని సచిన్‌కి బౌల్ చేసాను.” అని మోర్కెల్ చెప్పాడు.

ఆ తర్వాత ఐదు సంవత్సరాల మోర్కెల్‌కు మళ్లీ టెండూల్కర్‌కి బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈసారి అతను చాలా నమ్మకంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలుపొందింది. టెండూల్కర్ చేసిన 111 పరుగులు వృథా అయ్యాయి.

Read Also.. Under-19 Asia cup: రద్దైన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్.. సెమీ‎ఫైనల్లో బంగ్లాతో తలపడనున్న భారత్..