Ind Vs Pak: పాక్‌పై టీమిండియా గ్రాండ్‌ విక్టరీ.. ప్రధాని మోడీ, రాహుల్‌, అమిత్‌షా ఏమన్నారంటే?

|

Aug 29, 2022 | 6:30 AM

PM Narendra Modi: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై గ్రాండ్‌ విక్టరీ సాధించింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో దాయాదిని చిత్తు చేసింది.

Ind Vs Pak: పాక్‌పై టీమిండియా గ్రాండ్‌ విక్టరీ.. ప్రధాని మోడీ, రాహుల్‌, అమిత్‌షా ఏమన్నారంటే?
Pm Narendra Modi
Follow us on

PM Narendra Modi: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై గ్రాండ్‌ విక్టరీ సాధించింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో దాయాదిని చిత్తు చేసింది. తద్వారా గతేడాది ఇదే వేదికపై టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. కాగా చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించడంతో దేశమంతా సంబరాలు అంబరాన్నంటాయి. చాలాచోట్ల అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి మువ్వెన్నెల జెండాను పట్టుకుని బైక్‌లపై ర్యాలీలు తీశారు. ఇక హైదరాబాద్ లో యువకులు స్వీట్లు పంచుతూ.. జాతీయ నినాదాలతో హోరెత్తించారు.  కాగా టీమిండియా విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) కూడా స్పందించారు. భారత జట్టు ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘భారత్‌ ఈ రోజు అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసింది. గొప్ప నైపుణ్యాన్ని కనబరిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియాకు కంగ్రాట్స్‌’ అని అందులో రాసుకొచ్చారు.

మోడీతో పాటు కేంద్రమంత్రి అమిత్‌షా, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా టీమిండియాకు అభినందనలు తెలిపారు. అలాగే సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్‌ షమీ, మయాంక్‌ అగర్వాల్‌, వసీం జాఫర్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, గౌతమ్ గంభీర్, జస్ ప్రీత్ బుమ్రా తదితర ప్రముఖులు భారతజట్టును ప్రశంసల్లో ముంచెత్తారు. మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరిచారని కొనియాడారు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..