Team India: టీమిండియాలో ఊహించని మార్పులు.. ఈ నలుగురికి దిమ్మతిరిగే షాకివ్వనున్న గంభీర్..?

Gautam Gambhir team changes: టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఈ నలుగురికి మొండిచేయి చూపించేందుకు గంభీర్ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో ఎవరున్నారు, అసలు ఎందుకు తప్పించనున్నారో ఓసారి చూద్దాం.

Team India: టీమిండియాలో ఊహించని మార్పులు.. ఈ నలుగురికి దిమ్మతిరిగే షాకివ్వనున్న గంభీర్..?
Ind Vs Eng Goutam Gambhir

Updated on: Mar 06, 2026 | 10:40 AM

టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన తర్వాత భారత జట్టులో భారీ మార్పులు జరగవచ్చని చర్చలు జరుగుతున్నాయి. భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తన కఠిన నిర్ణయాలతో షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న గంభీర్.. మరోసారి ప్రక్షాళనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే స్పష్టం చేసిన గంభీర్..

భారత జట్టు భవిష్యత్తు మేరకు ఆడగలిగే ఆటగాళ్లకే ప్రాధాన్యం ఉంటుందని ఇప్పటికే గంభీర స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కొందరు సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav): ప్రపంచంలో అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం అతని వయసు 35. గంభీర్ దృష్టి 2028 ఒలింపిక్స్, భవిష్యత్ వరల్డ్ కప్‌లపై ఉంది. ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోతే, కెప్టెన్సీని యువ ఆటగాడికి అప్పగించే అవకాశం ఉంది. ఈ సందర్భంలో శుభ్మన్ గిల్ (Shubman Gill) లేదా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కు బాధ్యతలు ఇచ్చే అవకాశముంది.

2. మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రదర్శన తరచుగా చర్చనీయాంశంగా మారింది. కొత్తగా వచ్చిన యువ బౌలర్లు అర్షదీప్ సింగ్ (Arshdeep Singh), హర్షిత్ రాణా (Harshit Rana) జట్టులో తమ స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిలో గంభీర్ టీ20 జట్టును యువ బౌలర్లతో నిర్మించాలనుకుంటే సిరాజ్‌ను టీ20 సెటప్ నుంచి తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

3. సంజూ శాంసన్ (Sanju Samson):

సంజూ శాంసన్ (Sanju Samson) ఇటీవల అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ అతని కెరీర్‌లో నిరంతరత కొంత సమస్యగా ఉంది. టీమ్‌లో ఇప్పటికే ఇషాన్ కిషన్ (Ishan Kishan), రిషబ్ పంత్ (Rishabh Pant), ధ‌ృవ్ జురేల్ (Dhruv Jurel) వంటి వికెట్‌కీపర్ ఎంపికలు ఉన్నాయి. అయితే, వరల్డ్ కప్‌లో అతను రాణించకపోతే గంభీర్ అతనిపై కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

4. అక్షర్ పటేల్ (Axar Patel):

అక్షర్ పటేల్ అద్భుత ఆల్‌రౌండర్ అయినప్పటికీ జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. ప్రత్యేకంగా వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) ఎదుగుదల అతని స్థానాన్ని కష్టతరం చేస్తోంది. పవర్‌ప్లేలో బౌలింగ్ చేయగలగడం, బ్యాటింగ్‌లో సహకారం అందించడం వంటి లక్షణాలు సుందర్‌ను బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి.

భవిష్యత్తు కోసం గంభీర్ ప్రణాళిక..

గంభీర్ లక్ష్యం టీమ్ ఇండియాను మరింత బలమైన జట్టుగా తయారు చేయడం. అందువల్ల యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని భావిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత భారత టీ20 జట్టు రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us