ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ అసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు అడుగుపెట్టే సమయంలో.. జార్వో అనే వ్యక్తి టీమ్ మెంబర్స్‌తో కలిసి గ్రౌండ్‌లోకి వెళ్లిపోయి.. ఫీల్డింగ్‌కు రెడీ అయ్యాడు. ఆ తర్వాత ఆలస్యంగా గుర్తించిన పోలీస్ సెక్యూరిటీలు.. అనంతరం గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు. అయితే తాజాగా మరోసారి అదే వ్యక్తి.. సెక్యూరిటీని దాటుకుని మరీ బ్యాటింగ్‌కు వెళ్లాడు.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అవుటైన తర్వాత భారత జెర్సీలో ప్యాడ్స్, బ్యాట్ పట్టుకుని నెంబర్ ఫోర్ బ్యాట్స్‌మెన్‌లా క్రీజులోకి వచ్చేశాడు జార్వో. అతను బ్యాటింగ్‌కి సిద్ధమవుతున్న సమయంలో క్రీజులోకి వచ్చింది విరాట్ కోహ్లీ కాదని ఆలస్యంగా గుర్తించిన సెక్యూరిటీ అధికారులు, అతన్ని బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అయితే ఓ అనుమానాన్ని కూడా రేపుతోంది. అంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నుంచి ఓ అభిమాని ఇలా రెండుసార్లు క్రీజులోకి ఎలా రాగలిగాడని.. ఆటగాళ్ల సెక్యూరిటీకి గ్యారెంటీ ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడుతోంది. 345 పరుగుల వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ రాహుల్(8) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(59) ఎంతో ఓపికగా ఆడి ఈ సిరీస్‌లో రెండో అర్థ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం పుజారా(91), కోహ్లీ(45) ఇద్దరు సంయమనం పాటిస్తూ క్రీజులో పాతుకపోయారు.
“Just the one change, Jarvo 69 comes in for Virat Kohli” ?#ENGvIND #IndiavsEngland #IndvsEng
— Karamdeep (@oyeekd) August 27, 2021
Jarvo69 is a legend#jarvo #INDvsEND #ENGvIND pic.twitter.com/cv3uxlpu2T
— Raghav Padia (@raghav_padia) August 27, 2021