India vs England: నెట్టింట్లో ఆకట్టుకుంటున్న మాజీల పోరు.. ఇంగ్లాండ్ మాజీ సారథికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన ఇండియన్ మాజీ క్రికెటర్..

|

Feb 17, 2021 | 8:15 AM

India vs England: ఇంగ్లాండ్, భారత ప్లేయర్స్ గ్రౌండ్‌లో పోరాడుతుంటే రెండు దేశాల మాజీ ఆటగాళ్లు మాత్రం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నారు. ఎవరి టీమ్‌కి వారు మద్దతు

India vs England: నెట్టింట్లో ఆకట్టుకుంటున్న మాజీల పోరు.. ఇంగ్లాండ్ మాజీ సారథికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన ఇండియన్ మాజీ క్రికెటర్..
Follow us on

India vs England: ఇంగ్లాండ్, భారత ప్లేయర్స్ గ్రౌండ్‌లో పోరాడుతుంటే రెండు దేశాల మాజీ ఆటగాళ్లు మాత్రం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నారు. ఎవరి టీమ్‌కి వారు మద్దతు తెలుపుతూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ రసవత్తరంగా మారింది. దీంతో నెటిజన్లు కూడా ఎంతో ఆస్వాదిస్తున్నారు. భారత మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, వసీమ్‌ జాఫర్; ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా హాస్య చతురతతో పోస్ట్‌లు చేస్తుంటారు. జట్టును తక్కువ అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేస్తుంటారు. తర్వాత తమ అంచనా తప్పని గుర్తిస్తుంటారు. అయితే, తాజాగా పీటర్సన్‌, జాఫర్‌ మధ్య జరిగిన ‘ట్విటర్ పోరు’ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

భారత్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఘోర ఓటమిని చవిచూడటంతో పీటర్సన్‌ టీమిండియా అభిమానులను కవ్విస్తూ ఓ ట్వీట్ చేశాడు. ‘‘భారత్‌కు శుభాకాంక్షలు.. ‘ఇంగ్లాండ్-బి’ జట్టును ఓడించినందుకు’’ అని ట్వీటాడు. దీనికి జాఫర్‌ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.‘‘పీటర్సన్‌ను ట్రోల్ చేయకండి. అతడు సరదాగా ఇలా చేస్తున్నాడు. అయితే నాకో విషయం అర్థమైంది. దక్షిణాఫ్రికా వాళ్లు లేకుండా ఇంగ్లాండ్ ఎలా పూర్తి సామర్థ్యం కలిగిన జట్టు అవుతుంది?’’ అని జాఫర్‌ ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికా చెందిన పీటర్సన్‌ ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే పీటర్సన్‌కు మైండ్‌బ్లాక్‌ అయ్యేలా పంచ్‌ విసిరిన జాఫర్‌ను అభిమానులు పొగుడుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

India vs England: రెండో టెస్ట్ గెలుపులో అభిమానులదే కీలక పాత్ర.. టీమ్ ఇండియా సారథి ఆసక్తికర కామెంట్స్..