Phil Salt Auction Price: ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. ఆ జట్టు యంగ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు కోనుగోలు చేసింది. కాగా ఈ ఎమర్జింగ్ ప్లేయర్‌కు ఇదే మొదటి ఐపీఎల్. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ చేసే సామర్థ్యమున్న సాల్ట్ ఇప్పటివరకు 13 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 245 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 161.88గా ఉంది. అదేవిధంగా 11 వన్డేలు కూడా ఆడి మంచి స్కోర్లు సాధించాడు. అంతుకు ముందు దేశవాళీ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. కాగా ఇప్పటికే రిషభ్ పంత్ రూపంలో మెరుగైన బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ ఉన్నాడు. అయితే అతినికి బ్యాకప్ గా మరెవరూ లేవరు. ముఖ్యంగా. చివరి వరకు లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే అనుభవం ఉన్న బ్యాటర్ ఢిల్లీలో లేడు. ఇప్పుడు ఫిల్ సాల్ట్ రూపంలో పంత్ కు మంచి బ్యాకప్ దొరికేశాడని భావించవచ్చు.
టాప్ ఆర్డర్ బ్యాటర్లు: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, యశ్ ధుల్
ఫినిషర్స్: రిషబ్ పంత్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, రిపాల్ పటేల్
ఆల్‌రౌండర్లు: అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, అమన్ ఖాన్
స్పిన్నర్లు: కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్
ఫాస్ట్ బౌలర్లు: చేతన్ సకారియా, అన్రిచ్ నోర్తెజ్, లుంగి ఎనిగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి
ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి