PBKS vs RCB IPL 2023: మోహాలి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. అలాగే ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ఎదుట 175 పరుగుల లక్ష్యం ఉంది. ఇక ఆర్‌సీబీ తరఫున ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూ ప్లెసిస్ అర్థ శతకాలు పూర్తి చేసుకున్నారు. అలాగే వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కి 137 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని అందించారు.
అయితే హర్‌ప్రీత్‌బ్రార్ వేసిన 17 ఓవర్ తొలి బంతిని ఆడిన కోహ్లీ(59 పరుగులు) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. కోహ్లీ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఆ తర్వాతి బంతికే డకౌట్ అయ్యాడు. అనంతరం దినేష్ కార్తిక్‌తో కలిసి ఆడుతున్న ఫాఫ్ కూడా నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చుకున్నాడు. అందిన అవకాశాన్ని వదులుకోకుండా పంజాబ్ టీమ్ కెప్లెన్ సామ్ కర్రన్ ఆ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఫాఫ్ 84 పరుగుల వద్ద వెనుదిరగవలసి వచ్చింది. ఆపై డీకే కూడా 7 పరుగులకే వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన మహిపాల్ లామ్రార్(7), షహ్‌బాజ్ అహ్మద్(5) నాటౌట్‌గా ఇన్నింగ్స్ ముగించారు. హర్‌ప్రీత్‌బ్రార్2 వికెట్లు తీసుకోగా.. నాథన్ ఎల్లిస్, ఆర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
The average first innings score at Mohali is 172. So this is a competitive score for sure!
Come on lads, we can defend this! ?#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #PBKSvRCB pic.twitter.com/1GG8XSCu9a
— Royal Challengers Bangalore (@RCBTweets) April 20, 2023
కాగా, 175 లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కి శుభారంభం లభించలేదు. ఆర్‌సీబీ తరఫున మహ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్ తొలి బంతిని బౌండరీగా మలిచిన అథర్వ తైదే(4).. వెనువెంటనే ఎల్‌బీడబ్య్లూగా వెనుదిరిగాడు. అలాగే హసరంగా వేసిన 3వ ఓవర్‌లో మాథ్యూ షార్ట్ కూడా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక ప్రస్తుతం క్రీజులో ఓపెనర్‌గా వచ్చిన ఫ్రభ్‌సిమ్రాన్ సింగ్(13), లివింగ్‌స్టన్(2) ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..