PBSK vs CSK Highlights, IPL 2022: 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం.. పోరాడి ఓడిన చెన్నై..

| Edited By: Venkata Chari

Apr 25, 2022 | 11:34 PM

Punjab Kings vs Chennai Super Kings Highlights in Telugu: 188 పరుగులతో బరిలోకి దిగిన చెన్నై టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 176 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

PBSK vs CSK Highlights, IPL 2022: 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం.. పోరాడి ఓడిన చెన్నై..
Pbks Vs Csk

Punjab Kings vs Chennai Super Kings Highlights in Telugu: ఐపీఎల్ 2022లో భాగంగా 38వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీం 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై టీం కేవలం 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై తరుపున అంబటి రాయుడు (78) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌ల్లో పీబీకేఎస్‌కు ఇది నాలుగో విజయం. ఇప్పటి వరకు ఆ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి 8 మ్యాచ్‌ల్లో ఇది ఆరో ఓటమి. ఇప్పటి వరకు ఆ జట్టు కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ అత్యధికంగా అజేయంగా 88 పరుగులు చేశాడు. సీఎస్‌కే తరపున డ్వేన్ బ్రావో 2 వికెట్లు తీశాడు.

జట్ల వివరాలు:

చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్‌), ఎంఎస్ ధోనీ, మిచెల్‌ సాంట్నర్, డ్వేన్‌ ప్రిటోరియస్‌, డ్వేన్‌ బ్రావో, ముకేశ్‌ చౌదరి, మహీశా తీక్షణ

పంజాబ్‌: మయాంక్‌ అగర్వాల్, శిఖర్ ధావన్‌, జానీ బెయిర్‌ స్టో, లియామ్‌ లివింగ్‌ స్టోమ్, జితేశ్‌ శర్మ, భానుక రాజపక్స, రిషి ధావన్‌, కగిసో రబాడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్‌ సింగ్‌

Key Events

చెన్నైదే పైచేయి..

ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు గెలిస్తే ఆడితే చెన్నై 15, పంజాబ్‌ 11 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకుంది. ఈ లెక్కన చూస్తే చెన్నైదే అప్పర్‌ హ్యాండ్‌గా కనిపిస్తోంది.

పంజాబ్‌ బలహీనతలివే..

పంజాబ్‌ ఆటతీరు చూస్తుంటే వారి గ్రాఫ్‌ పడిపోతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం వీరికి మైనస్‌గా చెప్పొచ్చు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 25 Apr 2022 11:29 PM (IST)

    పంజాబ్ ఘన విజయం..

    188 పరుగులతో బరిలోకి దిగిన చెన్నై టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 176 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

  • 25 Apr 2022 11:25 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై..

    ధోనీ (12) రూపంలో కీలక సమయంలో చెన్నై టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. రిషీ ధావన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 19.3 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. విజయానికి మరో 3 బంతులో 20 పరుగులు చేయాల్సి ఉంది.

  • 25 Apr 2022 11:12 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై..

    రాయుడు (78) రూపంలో చెన్నై టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 17.5 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.

  • 25 Apr 2022 11:07 PM (IST)

    17 ఓవర్లకు స్కోర్..

    17 ఓవర్లు ముగిసే సరికి చెన్నై టీం 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. రాయుడు 77, జడేజా 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. చెన్నై ఇంకా 41 పరుగుల వెనుకంజలోనే ఉంది. చేతిలో మరో 6 వికెట్లు, 18 బంతులు మిగిలి ఉన్నాయి. 16 వ ఓవర్‌లో రాయుడు సందీప్ శర్మను ఉతికారేశాడు. వరుసగా 6, 6,6,4 బాదేసి, పంజాబ్ శిభిరంలో కలతలు రేపాడు.

  • 25 Apr 2022 10:49 PM (IST)

    రాయుడు హాఫ్ సెంచరీ..

    అంబటి రాయుడు ఒంటి పోరాటం చేస్తున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. కేవలం 28 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

  • 25 Apr 2022 10:36 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై..

    గైక్వాడ్ (30) రూపంలో చెన్నై టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో 12.3 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది.

  • 25 Apr 2022 10:26 PM (IST)

    10 ఓవర్లకు స్కోర్..

    10 ఓవర్లు ముగిసే సరికి చెన్నై టీం 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. రుతురాజ్ 24, రాయుడు 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. చెన్నై ఇంకా 119 పరుగుల వెనుకంజలోనే ఉంది. చేతిలో మరో 7 వికెట్లు, 58 బంతులు మిగిలి ఉన్నాయి.

  • 25 Apr 2022 10:11 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన చెన్నై..

    శివం దూబే(8) రూపంలో చెన్నై టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. రిషి ధావన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 6.6 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది.

  • 25 Apr 2022 10:04 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన చెన్నై..

    సాంట్నర్(9) రూపంలో చెన్నై టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 5.3 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది.

  • 25 Apr 2022 09:42 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై..

    188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాబిన్‌ ఉతప్ప ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో రిషి దావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 25 Apr 2022 09:25 PM (IST)

    ముగిసిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌..

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు సాధించింది. పంజాబ్‌ టీఎమ్‌లో శిఖర్‌ ధావన్‌ అత్యధికంగా 88 పరులు సాధించి అజేయంగా నిలిచాడు. తర్వాత రాజపక్సా 42 పరుగులు చేసి జట్టు స్కోరు పెంచేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌ బౌలింగ్ విషయానికొస్తే.. బ్రోవో 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మహీశ్‌ తీక్షణ 1 వికెట్‌ను పడగొట్టాడు. చెన్నై ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 9.35 రన్‌రేట్‌తో పరుగులు చేయాల్సి ఉంది.

  • 25 Apr 2022 09:15 PM (IST)

    మూడో వికెట్ డౌన్‌..

    ఇన్నింగ్స్‌ ముగుస్తున్న సమయంలో పంజాబ్‌ కింగ్స్‌ వికెట్లను సమర్పించుకుంటోంది. లియామ్‌ లివింగ్ స్టోమ్‌ 19 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు. డ్వేన్‌ బ్రావో బౌలింగ్‌లో ముకేష్‌ చౌదరీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 25 Apr 2022 09:09 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌..

    పంజాబ్‌ కింగ్స్‌ రెండో వికెట్ కోల్పోయింది. బ్రావే బౌలింగ్‌లో శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చిన రాజపక్సా 42 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్‌ రెండు వికెట్లు నష్టపోయి 157 పరగుల వద్ద కొనసాగుతోంది.

  • 25 Apr 2022 08:42 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్‌ ధావన్‌..

    జట్టు స్కోరు పెంచే పనిలో పడ్డ శిఖర్‌ ధావన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో రాణిస్తున్నాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసే సమయానికి 117 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 25 Apr 2022 08:38 PM (IST)

    వందమార్కును దాటేసిన పంజాబ్‌ స్కోర్‌..

    పంజాబ్‌ స్కోరు వంద పరుగుల మార్క్‌ను దాటింది. 13 ఓవర్లు ముగిసే సమయానికి 103 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో రాజపక్సా (28), శిఖర్‌ ధావన్‌ (46) పరుగులు వద్ద కొనసాగుతోంది.

  • 25 Apr 2022 08:15 PM (IST)

    ఆచితూచి ఆడుతోన్న పంజాబ్‌ బ్యాటర్లు..

    చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండడంతో పంజాబ్‌ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 9 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్‌ 63 పరగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో రాజపక్స (12), శిఖర్‌ ధావన్‌ (26) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 25 Apr 2022 08:01 PM (IST)

    తొలి వికెట్‌ డౌన్‌..

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 37 పరుగుల వద్ద మయాంక్‌ అగర్వాల్‌ మహీశా తీక్షణ బౌలింగ్‌లో శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 25 Apr 2022 07:03 PM (IST)

    టాస్‌ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌..

    టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్‌ చేయడానికి మొగ్గు చూపింది. డ్యూ ఫ్యాక్టర్‌ ఉండడంతో ఛేజింగ్‌కు అనుకూలిస్తుందన్న కారణంగా చెన్నై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే చివరి 4 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన వారే విజయాన్ని అందుకున్నారు. మరి చెన్నై తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టుకు ఏమేర కలిసొస్తుందో చూడాలి.

  • 25 Apr 2022 06:33 PM (IST)

    టాస్‌ కీలకం..

    వాంకాడే స్టేడియంలో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు జరిగితే మొదటి 4 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ టీమ్‌లు గెలిచాయి. చివరి 4 మ్యాచ్‌ల్లో ఫస్ట్‌ బ్యాటింగ్ చేసిన వారు గెలిచారు. డ్యూ ఫ్యాక్టర్‌ కారణంగా టాస్‌ గెలిచిన వాళ్లు తొలుత ఫీల్డింగ్‌ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Follow us on