పాకిస్థాన్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 150 ఓవర్లలో 823 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 317 పరుగులు, జో రూట్ 262 పరుగులు చేశారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌పై 267 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియగానే బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ జో రూట్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. జో రూట్ ముల్తాన్ మైదానంలో తన బట్టలు ఆరబెట్టుకున్నాడు. జో రూట్ బ్యాటింగ్ చేసిన బట్టలు చెమటతో తడిసిపోయాయి. దీంతో వాటిని బౌండరీ లైన్‌పై ఆరబెట్టాడు.
బ్యాటింగ్ తర్వాత, జో రూట్ ఇంగ్లాండ్ పెవిలియన్ సమీపంలో బౌండరీ లైన్‌పై తన చెమటతో తడిసిన దుస్తులను ఆరబెట్టాడు. అతను మైదానంలో తన జెర్సీ, ప్యాంటు, డ్రాయర్ కూడా ఆరబెట్టాడు. జో రూట్ దుస్తులు ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 375 బంతుల్లో 262 పరుగులు చేశాడు. అతడు 17 ఫోర్లు కొట్టాడు. ఇది మాత్రమే కాదు, అతను హ్యారీ బ్రూక్‌తో కలిసి 454 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఇంగ్లండ్‌కు టెస్టు క్రికెట్‌లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యమని చెప్పాలి. పాకిస్థాన్‌పై జో రూట్ డబుల్ సెంచరీ చేయడం సంచలనంగా మారింది. పాకిస్తాన్, శ్రీలంక, భారతదేశంలో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆసియాయేతర బ్యాట్స్‌మన్ జో రూట్ కావడం విశేషం. రూట్‌ను ఇంగ్లాండ్‌లో రన్-స్కోరింగ్ బ్యాట్స్‌మెన్ అని పిలుస్తారు. అయితే ఈ ఆటగాడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, UAE, వెస్టిండీస్, పాకిస్తాన్‌లలో 50 కంటే ఎక్కువ సగటును కలిగి ఉన్నాడు. భారతదేశంలో, అతను 45 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేశాడు.
Wondering how exhausted Joe Root must be after his mammoth stint in the middle?
He’s currently drying his soaking wet kit in the baking Multan sun 😂#PAKvENG pic.twitter.com/GWEJDjSmA8
— England’s Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) October 10, 2024