
India vs Pakistan, Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం భారీ వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్గ్ ఓడి టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. వర్షం పడి మ్యాచ్ ఆగిన సమయంలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్ స్టైల్ బ్యాటింగ్ కనిపించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రోహిత్.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు వన్డే క్రికెట్‌లో షాహీన్ అఫ్రిదిపై తొలి ఓవర్‌లోనే సిక్సర్ కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తొలి ఓవర్ తొలి 5 బంతుల్లో రోహిత్ శర్మ పరుగులేమీ చేయలేదు. షాహీన్ ఆ ఓవర్‌లోని చివరి బంతిని రోహిత్ కాళ్ల వైపు వేయడానికి ప్రయత్నించాడు. హిట్‌మ్యాన్ దానిని లెగ్ సైడ్ వైపు తిప్పి బౌండరీ లైన్ వెలుపల సిక్సర్‌గా పంపించాడు.
ఈ మ్యాచ్‌లో, షాహీన్‌పై భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేసి మొదటి 3 ఓవర్ల స్పెల్‌లో మొత్తం 31 పరుగులు చేశారు. ఈ సమయంలో అఫ్రిది వేసిన రెండు, మూడో ఓవర్లలో గిల్ కూడా 3 ఫోర్లు బాదాడు. తొలి వికెట్‌కు గిల్-రోహిత్‌ల మధ్య 121 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం కనిపించింది.
A Rohit Sharma special.
becomes the first batter to hit a six against Shaheen in first over in ODI.pic.twitter.com/oLtzDv0gt1
— Johns. (@CricCrazyJohns) September 10, 2023
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. వన్డే కెరీర్‌లో 240 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌కి ఇది 50వ అర్ధ సెంచరీ. వన్డేల్లో గిల్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ వికెట్‌కు నాలుగోసారి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వన్డేల్లో పాకిస్థాన్‌పై 18వ ఇన్నింగ్స్‌లో రోహిత్‌కి ఇది 7వ అర్ధ సెంచరీ.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..