Pakistan Cricket: ఇంగ్లాండ్ గడ్డపై ఘోర పరాభవం.. పాకిస్తాన్ హెడ్ కోచ్ పోస్ట్ ఊస్ట్

Pakistan Cricket: ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో తీవ్ర కలకలం మొదలైంది. వరుస ఓటములతో సతమతమవుతున్న టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించి, వైట్ బాల్ కోచ్ మైక్ హెసన్‌కు బాధ్యతలు అప్పగించేందుకు పీసీబీ సన్నాహాలు చేస్తోంది.

Pakistan Cricket: ఇంగ్లాండ్ గడ్డపై ఘోర పరాభవం.. పాకిస్తాన్ హెడ్ కోచ్ పోస్ట్ ఊస్ట్
Pakistan Cricket

Updated on: Aug 31, 2026 | 5:04 PM

Pakistan Cricket: ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్తాన్ ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా సాగుతోంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లలోనూ ఘోర పరాజయాన్ని చవిచూసింది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోగా, లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల భారీ వ్యత్యాసంతో చేతులెత్తేసింది. ఈ రెండు ఓటములతో సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకోవడమే కాకుండా, జట్టు మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలోకి మైక్ హెసన్

వరుస పరాజయాల నేపథ్యంలో టెస్ట్ జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పీసీబీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం వైట్ బాల్ ఫార్మాట్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న మైక్ హెసన్‌ను టెస్ట్ జట్టు బాధ్యతలు కూడా చూడాలని పీసీబీ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం లండన్‌లోనే ఉన్న మైక్ హెసన్, ఆకిబ్ జావేద్‌తో కలిసి ప్రిన్స్ చార్లెస్ ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ పర్యటనలోనే ఆయనకు టెస్ట్ జట్టు బాధ్యతలను కూడా అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది.

మూడో టెస్టుకు ముందే డ్రెస్సింగ్ రూమ్‌లోకి హెసన్

సెప్టెంబర్ 9 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మైక్ హెసన్ పాకిస్తాన్ జట్టుతో కలవనున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మూడో టెస్ట్ సమయంలో హెసన్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది సర్ఫరాజ్ అహ్మద్ పదవికి ముగింపు కార్డు పడినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే మూడు ఫార్మాట్లలోనూ మైక్ హెసన్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

టెస్టుల్లో సర్ఫరాజ్ ట్రాక్ రికార్డ్ దారుణం

ఈ ఏడాది ఏప్రిల్ 18న బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌కు ముందు సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు. అయితే ఆయన ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. మొదటి అసైన్‌మెంట్‌లోనే బంగ్లాదేశ్ చేతిలో సొంత గడ్డపై వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో 2 టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో మరో వైట్‌వాష్ దిశగా ప్రయాణిస్తుండటంతో పీసీబీ వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us