Pakistan: సెలక్షన్ కమిటీలో చోటు.. కట్‌చేస్తే.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్.. ఆ వివాదాల ప్లేయర్ ఎవరంటే?

|

Feb 07, 2023 | 6:15 PM

Kamran Akmal Retirement: పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌కు కొన్ని రోజుల క్రితం సీనియర్ సెలక్షన్ కమిటీలో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. జూనియర్ కమిటీ చైర్మన్‌గా పీసీబీ ఎంపిక చేసింది.

Pakistan: సెలక్షన్ కమిటీలో చోటు.. కట్‌చేస్తే.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్.. ఆ వివాదాల ప్లేయర్ ఎవరంటే?
Paksitan Cricket Team
Follow us on

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ నేడు అంటే ఫిబ్రవరి 7న మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజంతా ఫించ్ రిటైర్మెంట్ గురించే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా పాకిస్థాన్ నుంచి కూడా ఓ బిగ్ న్యూస్ వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కమ్రాన్ అక్మల్ కూడా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత వారమే అక్మల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీలో చోటు కల్పించింది.

కమ్రాన్ అక్మల్ 2006లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం..

కమ్రాన్ అక్మల్ టీ20 కెరీర్‌ను పరిశీలిస్తే, ఈ ఆటగాడు 28 ఆగస్టు 2006న ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. బ్రిస్టల్‌ వేదికగా ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ మధ్య ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ తన చివరి టీ20 మ్యాచ్‌ని 2 ఏప్రిల్ 2017న వెస్టిండీస్‌తో ఆడాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది.

2017 నుంచి పాకిస్థాన్ జట్టుకు దూరంగా..

పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కమ్రాన్ అక్మల్ 23 నవంబర్ 2002న జింబాబ్వేపై తన వన్డే అరంగేట్రం చేశాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో పాకిస్థాన్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరిగింది. అయితే, కమ్రాన్ అక్మల్ 2017 నుంచి అంతర్జాతీయ వన్డేల్లో కనిపించలేదు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ తన చివరి అంతర్జాతీయ వన్డేని 2 ఏప్రిల్ 2017న వెస్టిండీస్‌తో ఆడాడు.

ఇవి కూడా చదవండి

పెషావర్ జల్మీలో కొత్త బాధ్యత..

అదే సమయంలో, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత, కమ్రాన్ అక్మల్‌కు కొత్త బాధ్యత వచ్చింది. వాస్తవానికి, పాకిస్థాన్ సూపర్ లీగ్ జట్టు పెషావర్ జల్మీ కమ్రాన్ అక్మల్‌ను జట్టు బ్యాటింగ్ సలహాదారుగా, మెంటార్‌గా నియమించింది. కమ్రాన్ అక్మల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభానికి ముందు పెషావర్ జల్మీ జట్టుతో ఒక వారం గడపనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..