ఆ ఇద్దరి ప్లేయర్లు త్వరగా అవుటైతే.. ఆజామ్ జట్టు ఖేల్ ఖతం.. టీమిండియాలో ఫుల్ జోష్.!

ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. ఈ మెగా టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు పాకిస్తాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక తన తదుపరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా భారత్‌తో తలబడనుంది. బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు బుధవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆ ఇద్దరి ప్లేయర్లు త్వరగా అవుటైతే.. ఆజామ్ జట్టు ఖేల్ ఖతం.. టీమిండియాలో ఫుల్ జోష్.!
Pakistan Babar Azam

Updated on: Aug 31, 2023 | 10:05 AM

ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. ఈ మెగా టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు పాకిస్తాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక తన తదుపరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా భారత్‌తో తలబడనుంది. బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు బుధవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంతటి విజయం సాధించినప్పటికీ.. పాక్ జట్టుకు ఓ బలహీనత ఎదురైంది. ఆ టీం ఓపెనర్ల ఫెయిల్యూర్.. టీమిండియాకు మంచి శుభారంభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో జరిగిన ఆసియాకప్‌ తొలి మ్యాచ్‌లో పాక్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ 151 పరుగులు చేయగా.. ఇఫ్తికార్ అహ్మద్ 109 పరుగులతో అదరగొట్టాడు. ఇలా ఇద్దరు ప్రధాన బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించినప్పటికీ.. ఆ జట్టు ఓపెనింగ్ జోడీ మాత్రం గత కొద్ది మ్యాచ్‌ల నుంచి వైఫల్యం చెందుతూనే వస్తున్నారు.

ఫకర్ జమాన్ ఫ్లాప్ షో..

నేపాల్ వంటి చిన్న జట్టుపై పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆతిధ్య జట్టు భారీ స్కోర్ సాధించడం తప్పదని.. ఓపెనర్లు పరుగుల వర్షం కురిపిస్తారని అందరూ భావించారు. ఇమామ్-ఉల్-హక్, ఫకర్ జమాన్ వంటి అనుభవజ్ఞులైన బ్యాటర్లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడతారని అనుకున్నారు. కానీ పాకిస్థాన్ భారీ స్కోరు సాధించడంలో ఓపెనర్ల సహకారం అంతంతమాత్రంగానే ఉంది. ఏడో ఓవర్ సమయంలో కేవలం 5 బంతుల వ్యవధిలోనే ఓపెనర్లిద్దరూ పెవిలియన్‌కు చేరడం.. ఆ సమయానికి పాక్ జట్టు స్కోరు కేవలం 25 పరుగులు మాత్రమే ఉంది. ఇందులో ఫకర్ 14 పరుగులు చేయగా.. ఇమామ్ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. గత 6 నెలలుగా ఫకర్ పేలవ ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నాడు. గత 7 ఇన్నింగ్స్‌లలో ఒక అర్ధ సెంచరీ కూడా సాధించలేదు. ఇక ఇమామ్ గత కొంతకాలంగా నిలకడగా పరుగులు చేస్తున్నాడు. కానీ ఈ మధ్య మాత్రం విఫలమవుతూ వస్తున్నాడు. అలాగే డైరెక్ట్ రన్‌-ఔట్ అవుతున్నాడు. కాబట్టి, టీమిండియా తోపు ఫీల్డింగ్‌తో వీరిద్దరిని తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చడం ఈజీ అని చెప్పొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..