Video: ఒకే ఓవర్లో 3 నోబాల్స్ వేసిన పాక్ బౌలర్.. కట్‌చేస్తే.. మ్యాచ్ ఫిక్సింగ్‌తో జట్టు నుంచి ఔట్..

|

Jan 26, 2024 | 3:20 PM

Shoaib Malik Match Fixing Allegation: మూడో వివాహం తర్వాత, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫార్చ్యూన్ బారిసాల్ తరపున ఆడుతున్న షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ తర్వాత జట్టు నుంచి బహిష్కరణకు గురయ్యాడని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Video: ఒకే ఓవర్లో 3 నోబాల్స్ వేసిన పాక్ బౌలర్.. కట్‌చేస్తే.. మ్యాచ్ ఫిక్సింగ్‌తో జట్టు నుంచి ఔట్..
Shoaib Maliks Match Fixing
Follow us on

Shoaib Malik Match Fixing Allegation: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, వెటరన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. గత వారమే, షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకొని మూడవసారి వివాహం చేసుకోవడం ద్వారా ప్రతిచోటా వార్తల్లో కనిపిస్తున్నాడు. షోయబ్ మూడో పెళ్లి తర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కనిపించాడు. ఈ లీగ్‌లో ఫార్చూన్ బరిషల్ తరపున ఆడుతున్న షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, అతడిని జట్టు నుంచి తప్పించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ఫార్చ్యూన్ బారిసల్ ఫిక్సింగ్ ఆరోపణలతో షోయబ్ మాలిక్ కాంట్రాక్ట్‌ను మధ్య-సీజన్ రద్దు చేసింది. మాలిక్ కూడా జట్టు నుంచి బయటకు వచ్చాడు. టోర్నమెంట్ నుంచి మధ్యలోనే దుబాయ్‌కి నిష్క్రమించాడు.

నో బాల్ వివాదం..

జనవరి 22వ తేదీన బరిసాల్ వర్సెస్ ఖుల్నా టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బారిసాల్‌ బౌలింగ్‌లో అటాక్‌ చేసిన మాలిక్‌ ఒక్క ఓవర్‌ మాత్రమే వేసి 18 పరుగులు ఇచ్చాడు. అయితే, ఈ ఓవర్ లోనే మాలిక్ 3 నో బాల్స్ విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫాస్ట్ బౌలర్లు ఒక ఓవర్‌లో మూడు నో బాల్‌లు వేయడం చాలా అరుదు. అయితే, స్పిన్ బౌలర్ అయిన మాలిక్ ఒకే ఓవర్‌లో మూడు నో బాల్‌లు వేశాడు. అందుకే, మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

స్పాట్ ఫిక్సింగ్ అనుమానం..

2010లో పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్ ఇలాంటి నో బాల్స్ వేశారు. ఆ తర్వాత వీరిద్దరూ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. విచారణలో వీరిద్దరూ దోషులుగా తేలింది. ఈ విషయంలో ఇప్పుడు షోయబ్ మాలిక్ విషయంలోనూ అదే సందేహం కలుగుతోంది. మాలిక్ కూడా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారా అనేది విచారణ తర్వాత తేలనుంది.

సానియాతో సంబంధాలు కట్..

తాజాగా షోయబ్ మాలిక్ మూడో పెళ్లితో వార్తల్లో నిలిచాడు. నో బాల్ వివాదానికి రెండు రోజుల ముందు, షోయబ్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం షోయబ్ , భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మధ్య 13 సంవత్సరాల సుదీర్ఘ బంధాన్ని కూడా ముగించింది. షోయబ్ మాలిక్ కూడా సానియాను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..