Team India: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌.. టీమిండియాకు కలిసొచ్చిన పాకిస్తాన్ ఓటమి.. ఎలాగంటే?

World Test Championship: రావల్పిండి టెస్ట్‌లో పాకిస్తాన్ ఓటమి.. టీమిండియాకు ఎలా కలిసొచ్చిందన్నదే కదా మీ డౌట్.? ఎందుకంటే..

Team India: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌.. టీమిండియాకు కలిసొచ్చిన పాకిస్తాన్ ఓటమి.. ఎలాగంటే?
World Test Championship

Updated on: Dec 06, 2022 | 8:09 AM

రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ అద్బుతమైన విజయాన్ని అందుకుంది. నిర్జీవమైన పిచ్‌పై పాక్‌ను స్వదేశంలోనే 17 ఏళ్ల తర్వాత మట్టి కరిపించింది ఇంగ్లీష్ జట్టు. దీంతో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడు టెస్టుల సిరీస్‌లో బాబర్ అజామ్ అండ్ కో 0-1తో వెనుకబడి ఉన్నారు. ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడే అవకాశాలకు సంక్లిష్టం చేసుకుంది. అయితే ఇక్కడొక విచిత్రం ఏమిటంటే.. టీమిండియాకు ఇది బాగా కలిసొచ్చింది. అదెలాగంటే.?

వాస్తవానికి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో, పాకిస్థాన్ జట్టు(46.67 శాతం) ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. ఇందులో ఆస్ట్రేలియా(72.73 శాతం) అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా (60 శాతం) రెండో స్థానం, శ్రీలంక(53.33 శాతం) మూడో స్థానంలో ఉన్నాయి. అదే సమయంలో టీమిండియా 52.08 శాతం మార్కులతో నాలుగో స్థానంలో ఉంది. ఇక రావల్పిండి టెస్ట్‌లో పాకిస్తాన్ ఓటమి.. టీమిండియాకు ఎలా కలిసొచ్చిందన్నదే కదా మీ డౌట్.? ఎందుకంటే ఇప్పుడు భారత్‌పై పాయింట్ల కోసం అంతగా సిరీస్‌ల మీద సిరీస్‌లు గెలవాలన్న ప్రభావం ఉండదు. ఆస్ట్రేలియాతో జరగబోయే 4 టెస్టుల సిరీస్‌లో ఓడిపోయినా టీమిండియా WTC ఫైనల్‌ను ఖచ్చితంగా ఆడగలడు. అయితే, దీని కోసం బంగ్లాదేశ్‌తో జరగబోయే 2 టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకోవాలి.

మరోవైపు భారత్‌తో పాటు ఆస్ట్రేలియాకు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకోసం ఆ జట్టు వెస్టిండీస్‌పై మరో టెస్టు, దక్షిణాఫ్రికాపై కనీసం రెండు టెస్టులైనా గెలవాలి. కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ 2023 జూన్‌లో ఓవల్‌ వేదికగా జరగనుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలన్నదే భారత్‌ రోడ్‌మ్యాప్‌. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే 4 టెస్టుల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us