మహిళల క్రికెట్ ప్రపంచకప్(Women’s World Cup 2022)లో భారత జట్టు మంగళవారం బంగ్లాదేశ్(India Vs Bangladesh)తో ఆరో మ్యాచ్‌లో భాగంగా తలపడనుంది. హామిల్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం కానుంది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిందే. లేదంటే ఒట్టి చేతులతో ఇంటికి బయల్దేరాల్సిందే. ఇప్పటి వరకు మొత్తం ఐదు మ్యాచులు ఆడిన భారత్, రెండు మ్యాచుల్లో విజయాలు సాధించగా, మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీంతో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా టీంలతో ఎలాగైనా విజయం సాధించాల్సి ఉంటుంది. మహిళల ప్రపంచకప్‌లో ఈరోజు వెస్టిండీస్, పాకిస్థాన్(Pakistan Vs West Indies) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో వెస్టిండీస్ రన్ రేట్ మరింత దిగజారింది. అదే సమయంలో వెస్టిండీస్ కంటే టీమిండియా రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా విజయం సాధిస్తే సెమీఫైనల్‌కు వెళ్లే మార్గం కాస్త సులువైనట్లే.
బంగ్లాదేశ్‌పై 100 శాతం విజయాలు..
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య కేవలం 4 ODI మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. వాటన్నింటిలో టీమ్ ఇండియా గెలిచింది. ఇరుజట్ల మధ్య 5 సంవత్సరాల క్రితం 2017లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి.
జట్టులో పూనమ్‌కి చోటు దక్కే అవకాశం..
ఈ టోర్నీలో పూనమ్ యాదవ్‌కు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకునే ఛాన్స్ ఉంది. లెగ్‌బ్రేక్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 57 వన్డేల్లో 79 వికెట్లు పడగొట్టింది. అదే సమయంలో ఆమె ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టింది.
బంగ్లాదేశ్‌తో ఆడిన 2 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు కూడా పడగొట్టింది. ఈ కీలక మ్యాచ్‌లో మిథాలీ రాజ్ ఖచ్చితంగా పూనమ్‌కు జట్టులో చోటివ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
మూడు మ్యాచుల్లో ఓడిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్ 4 మ్యాచ్‌లు ఆడి ఒకటి మాత్రమే గెలిచింది. ఆ జట్టు 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 9 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. భారత్‌పై కూడా బంగ్లాదేశ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుందని ఎదరుచూస్తున్నారు.
మ్యాచ్ ఉదయం 6:30 గంటలకు ప్రారంభం..
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం (IST) ఉదయం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. 6 గంటలకు టాస్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషల్లో వ్యాఖ్యానంతో చూడొచ్చు.
Also Read: Harbhajan Singh: పెద్దల సభలో అడుగుపెట్టనున్న హర్భజన్ సింగ్.. రాజ్యసభకు నామినేట్ చేసిన ఆప్..
IPL 2022: ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగుల వీరులు వీరే.. లిస్టులో నలుగురు భారతీయులే..